Breaking News

బోణీ కొట్టిన బంగ్లాదేశ్‌

Published on Sun, 06/14/2026 - 20:42

2026 మహిళల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ తమ ప్రయాణాన్ని విజయంతో మొదలుపెట్టింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇవాళ (జూన్‌ 14) జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి, టోర్నీ చరిత్రలో తమ అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. అరంగేట్రం బ్యాటర్‌ ఫిర్దౌస్‌ (50) మెరుపు అర్ద శతకంతో బంగ్లా గెలుపుతో ప్రధానపాత్ర పోషించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. మరుఫా అక్తర్‌ (4-0-31-2), ఫరిహా త్రిస్న (4-0-32-1) చక్కటి బౌలింగ్‌తో కీలక వికెట్లు పడగొట్టారు. అయితే కెప్టెన్ బార్బెట్‌ డి లీడ్‌ 45 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. 

లీడ్‌ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ కారణంగా నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగలిగింది. ఆఖర్లో ఐరిస్‌ జ్విల్లింగ్‌ (13 నాటౌట్‌), సిల్వర్‌ సీగర్స్‌ (10 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఫిర్దౌస్, దిల్హర అక్తర్‌ (26) శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించి జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపారు. ఫిర్దౌస్‌ కేవలం 32 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

అంతా సజావుగా సాగుతున్న వేల, నెదర్లాండ్స్ బౌలర్లు అనూహ్య పోరాట పటిమ కనబరిచారు. కరోలిన్‌ డి లాంజ్‌ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను  ఆసక్తికరంగా మార్చింది. ఫిర్దౌస్‌ అర్ధశతకం అనంతరం ఔట్ కాగా, కెప్టెన్ నిగార్‌ సుల్తానా ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. 

అనంతరం సిల్వర్ సీగర్స్ దిల్హరాను ఔట్ చేయగా, ఫ్రెడెరిక్ ఓవర్‌డైక్ అద్భుత డైరెక్ట్ హిట్‌తో శోభన మోస్తరీను రనౌట్‌ చేసింది. దీంతో బంగ్లా స్కోర్‌ 67/0 నుంచి 85/4కు పడిపోయి ఒత్తిడిలో పడింది.

ఈ దశలో అనుభవజ్ఞురాలు షర్మిన్‌ అక్తర్‌ (37 నాటౌట్‌), యువ బ్యాటర్ షోర​ఆన అక్తర్‌ (18 నాటౌట్‌) జాగ్రత్తగా ఆడి, మరో 5 బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్‌ను (4 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేర్చారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో లాంజ్‌ 2, సిల్వర్‌ ఓ వికెట్‌ తీశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)