Breaking News

సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లిస్‌

Published on Thu, 10/29/2026 - 15:39

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్‌ మిడిలార్డర్‌ ఆటగాడు జోస్‌ ఇంగ్లిస్‌ సెంచరీతో కదంతొక్కాడు. టెస్ట్‌ల్లో అతడికి ఇది రెండో శతకం. తొలి టెస్ట్‌ సెంచరీని శ్రీలంకలో చేసిన అతడు.. రెండో సెంచరీని సౌతాఫ్రికాలో బాదాడు. ఇంగ్లిస్‌ స్వల్ప కెరీర్‌లో మొత్తంగా ఇది ఆరో శతకం. టెస్ట్‌ల్లో రెండింటితో పాటు వన్డే, టీ20ల్లోనూ తలో రెండు శతకాలు బాదాడు.

కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లిస్‌ సెంచరీ చేశాడు. 135 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లిస్‌తో పాటు అలెక్స్‌ క్యారీ (80), కెమరూన్‌ గ్రీన్‌ (65), మ్యాట్‌ రెన్షా (74) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్‌ మూడో రోజు తొలి సెషన్‌ నడుస్తుండగా 7 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.

కూపర్‌ కన్నోల్లీ (12), మిచెల్‌ స్టార్క్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు. మిగతా ఆసీస్‌ ప్లేయర్లలో ట్రవిస్‌ హెడ్‌ 41, లబూషేన్‌, కమిన్స్‌ డకౌట్ అయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్‌ 4 వికెట్లు​ తీయగా.. యాన్సెన్‌ 2, రబాడ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్‌ (78), అకెర్‌మన్‌ (95), బెడింగ్హమ్‌ (50), యాన్సెన్‌ (52) అర్ద సెంచరీలతో రాణించారు. రికెల్టన్‌ 42, బ్రీట్జ్కీ 2 పరుగులు చేయగా.. బవుమా, ముల్దర్‌, కొయెట్జీ, రబాడ డకౌట్లయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 6 వికెట్లు పడగొట్టగా.. లియోన్‌ 2, హాజిల్‌వుడ్‌, కన్నోల్లీ తలో వికెట్‌ తీశారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచి సమంగా ఉన్నాయి. 

ఇదీ చదవండి: విండీస్‌ స్పిన్నర్‌ రికార్డు ప్రదర్శన


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)