Breaking News

BGT 2024-25: ఆస్ట్రేలియాకు షాక్‌

Published on Sun, 12/29/2024 - 11:56

టీమిండియాతో ఐదో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్‌ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ జోస్‌ ఇంగ్లిస్‌ సిడ్నీ టెస్ట్‌కు దూరమయ్యాడు. నాలుగో టెస్ట్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా ఇంగ్లిస్‌ గాయపడ్డాడు. ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేయలేదు. 

ప్రస్తుత ఆసీస్‌ జట్టులో ఇంగ్లిస్‌ ఒక్కడే స్పేర్‌ బ్యాటర్‌గా ఉన్నాడు. ఆసీస్‌ బోర్డు బిగ్‌బాష్‌ లీగ్‌ కోసం బ్యూ వెబ్‌స్టర్‌ను ఇదివరకే రిలీజ్‌ చేసింది. ఇంగ్లిస్‌ వైదొలగడంతో ఐదో టెస్ట్‌ కోసం నాథన్‌ మెక్‌స్వీనికి పిలుపు అందవచ్చు. 

మిచెల్‌ మార్ష్‌ పేలవ ఫామ్‌తో సతమతమవుతండటంతో ఐదో టెస్ట్‌లో మెక్‌స్వీనికి అవకాశం రావచ్చు. మెక్‌స్వీనికి ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. ఇంగ్లిస్‌ ప్రస్తుతం భారత్‌తో ఆడుతున్న ఆసీస్‌ జట్టులో సభ్యుడు కాదు. నాలుగో టెస్ట్‌ రేపటితో ముగియనుండగా.. ఈ సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్ట్‌ వచ్చే ఏడాది జనవరి 3న మొదలుకానుంది.

భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్‌ విషయానికొస్తే.. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి 296 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. లయోన్‌ (13), బోలాండ్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్‌ 3, జడేజా ఓ వికెట్‌ పడగొట్టారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ (70) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 82, రోహిత్‌ శర్మ 3, కేఎల్‌ రాహుల్‌ 24, విరాట్‌ కోహ్లి 36, ఆకాశ్‌దీప్‌ 0, రిషబ్‌ పంత్‌ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్‌ రెడ్డి 114, వాషింగ్టన్‌ సుందర్‌ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌, బోలాండ్‌, లయోన్‌ తలో 3 వికెట్లు పడగొట్టారు.

దీనికి ముందు ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్‌ కొన్‌స్టాస్‌ (60), ఉస్మాన్‌ ఖ్వాజా (57), లబూషేన్‌ (72), కమిన్స్‌ (49), అలెక్స్‌ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్‌ 2, సుందర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి