జోష్‌ ఇంగ్లిస్‌ రికార్డు సెంచరీ.. ఆసీస్‌ సిరీస్‌ విజయం

Published on Sat, 09/07/2024 - 08:02

ఎడిన్‌బరో: అంతర్జాతీయ టి20ల్లో ఆ్రస్టేలియా తరఫున వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన జోష్‌ ఇంగ్లిస్‌ (49 బంతుల్లో 103; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) స్కాట్లాండ్‌తో జరిగిన రెండో టి20లో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌ ఆసీస్‌ ఆ్రస్టేలియా 70 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తుచేసింది. 

ఫలితంగా మరో మ్యాచ్‌ మిగిలుండగానే  2–0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ట్రవిస్‌ హెడ్‌ (0) డకౌట్‌ కాగా, మూడో స్థానంలో బరిలోకి దిగిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇంగ్లిస్‌ రికార్డు విశ్వరూపం చూపాడు.

స్కాట్లాండ్‌ బౌలర్ల అనుభవరాహిత్యాన్ని సొమ్ము చేసుకుంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 43 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గతంతో తనతో పాటు ఫించ్, మ్యాక్స్‌వెల్‌ పేరిట ఉన్న 47 బంతుల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును అతను బద్దలుకొట్టాడు. 

ఇతర బ్యాటర్లలో కామెరూన్‌ గ్రీన్‌ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రాడ్‌ క్యూరీ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్‌ 16.4 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. 

బ్రెండన్‌ మెక్‌మలెన్‌ (42 బంతుల్లో 59; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో మార్కస్‌ స్టొయినిస్‌ 4, కామెరూన్‌ గ్రీన్‌ రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్‌ శనివారం జరగనుంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)