T20 WC 2026: గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కిన జోస్‌ బట్లర్‌

Published on Thu, 02/12/2026 - 18:51

ఇంగ్లండ్‌ వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌ జోస్ బట్లర్‌ తన అసమాన క్యాచింగ్‌ ప్రతిభతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బట్లర్ 122 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ ద్వారా వదిలిన బంతిని పట్టుకుని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్యాచ్ పట్టిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడు. బట్లర్‌కు ముందు ఈ ఫీట్‌ను సాధించేందుకు చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవరి వల్ల కాలేదు.

బట్లర్‌ మాత్రం తన అద్భుతమైన హ్యాండ్‌-ఐ కమ్యూనికేషన్‌తో, బంతిపైనే పూర్తి ఏకాగ్రత ఉంచి అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకున్నాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ బ్యాటర్‌ తిమోతి షానన్ జెబ్సీలన్ పేరిట ఉండేది. 2021లో తిమోతి 119.86 మీటర్ల ఎత్తు నుంచి పడ్డ బంతిని పట్టుకుని రికార్డు సృష్టించాడు. తాజాగా బట్లర్ తిమోతి రికార్డును అధిగమించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ప్రవేశించాడు.  

ఈ ఫీట్‌కు క్రికెట్‌తో ఏ సంబంధం లేనప్పటికీ.. ఈ అనుభవం మాత్రం బట్లర్‌కు ఆన్‌ ఫీల్డ్‌ చాలా ఉపయోగపడుతుంది. ఫీల్డింగ్‌ సమయంలో ఎప్పుడైనా ఇలాంటి పరీక్ష ఎదురైతే బట్లర్‌ తప్పక సక్సెస్‌ అయ్యే అవకాశం ఉంటుంది. 

బట్లర్‌ ఇప్పటికే ఆన్‌ ఫీల్డ్‌లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకున్నాడు. వికెట్‌కీపర్‌గానే కాకుండా ఫీల్డర్‌గానూ పలు మంచి అనుభవాలు కలిగి ఉన్నాడు. తాజా అనుభవం (గిన్నిస్‌ రికార్డు) మాత్రం బట్లర్‌ను చాలా ప్రత్యేకంగా ఉంచుతుంది. ఈ గిన్నిస్‌ రికార్డు ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

ఇదిలా ఉంటే, బట్లర్‌ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్నాడు. ఈ విధ్వంసకర బ్యాటర్‌ ఇటీవలికాలంలో ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ప్రపంచకప్‌లోనూ బట్లర్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. నేపాల్‌తో మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన అతను.. నిన్న వెస్టిండీస్‌పై 21 పరుగులకు ఔటయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో బట్లర్‌కు శుభారంభాలే లభించినా, పెద్ద స్కోర్లుగా మలుచుకోలేకపోయాడు.

బట్లర్‌ ఫామ్‌లాగే, మెగా టోర్నీ ఇంగ్లండ్‌ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తొలుత పసికూన నేపాల్‌ చేతిలో తృటిలో ఘోర పరాభవాన్ని తప్పించుకున్న ఈ జట్టు.. నిన్న విండీస్‌ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో విండీస్‌, స్కాట్లాండ్‌, ఇటలీ తర్వాత నాలుగో స్థానంలో ఉంది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)