Breaking News

విధ్వంసకర వీరుడిని జట్టులో కలుపుకున్న ఇంగ్లండ్‌

Published on Thu, 09/04/2025 - 11:00

తాజాగా ముగిసిన హండ్రెడ్‌ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసి, ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచిన ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ విధ్వంసకర ఆటగాడు జోర్డన్‌ కాక్స్‌కు ఇంగ్లండ్‌ జాతీయ జట్టు నుంచి పిలుపందింది. 

త్వరలో ఐర్లాండ్‌లో పర్యటించబోయే ఇంగ్లండ్‌ జట్టులో కాక్స్‌ యాడ్‌ చేయబడ్డాడు. ఈ పర్యటన కోసం 14 మంది సభ్యుల జట్టును ఇదివరకే ప్రకటించినా, హండ్రెడ్‌ లీగ్‌ ప్రదర్శనల కారణంగా కాక్స్‌ను 15వ ఆటగాడిగా జట్టులో యాడ్‌ చేశారు.

ఐర్లాండ్‌ పర్యటనలో ఇంగ్లండ్‌ మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 17-21 మధ్యలో డబ్లిన్‌ వేదికగా జరుగనుంది.

కాక్స్‌ హండ్రెడ్‌ లీగ్‌-2025లో 300కు పైగా పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కాక్స్‌ ప్రదర్శనల కారణంగా అతని జట్టు వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ సీజన్‌లో 300కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కాక్స్‌ మాత్రమే.

24 ఏళ్ల కాక్స్‌ ఇదివరకే ఇంగ్లండ్‌ తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గతేడాది హోం సిరీస్‌లో అతను ఆస్ట్రేలియాపై టీ20 అరంగేట్రం చేసి రెండు టీ20లు ఆడాడు. అనంతరం కాక్స్‌ వెస్టిండీస్‌లో వన్డే అరంగేట్రం చేశాడు.

ఐర్లాండ్‌లో పర్యటించబోయే ఇంగ్లండ్‌ జట్టుకు జేకబ్‌ బేతెల్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ పర్యటన కోసం ఇంగ్లండ్‌ సెలెక్టర్లు కెప్టెన్‌ బ్రూక్‌కు విశ్రాంతినిచ్చారు.

ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు..
జేకబ్‌ బేతెల్‌ (కెప్టెన్‌), విల్‌ జాక్స్‌, రెహాన్‌ అహ్మద్‌, జేమీ ఓవర్టన్‌, లియామ్‌ డాసన్‌, జోస్‌ బట్లర్‌, టామ్‌ బాంటన్‌, ఫిల్‌ సాల్ట్‌, జోర్డన్‌ కాక్స్‌, సోన్నీ బేకర్‌, టామ్‌ హార్ట్లీ, సాకిబ్‌ మహమూద్‌, లూక్‌ వుడ్‌, మ్యాట్‌ పాట్స్‌, ఆదిల్‌ రషీద్‌

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)