Breaking News

మంచి ఫీల్డర్‌ మాత్రమే కాదు.. జాంటీ రోడ్స్‌ చర్య వైరల్‌

Published on Wed, 05/03/2023 - 19:58

జాంటీ రోడ్స్‌.. ఈ పేరు వినగానే సంచలన క్యాచ్‌లు.. మెరుపువేగంతో రనౌట్లు చేసిన సంఘటనలు గుర్తుకొస్తాయి. తన స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో ఎన్నోసార్లు సౌతాఫ్రికా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆటకు రిటైర్మెంట్‌ తర్వాత ఫీల్డింగ్‌ కోచ్‌గా మారిన జాంటీ రోడ్స్‌ తన మార్క్‌ను చూపిస్తూనే ఉన్నాడు. తాజాగా ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు జాంటీ రోడ్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

అయితే రోడ్స్‌ మంచి ఫీల్డర్‌ మాత్రమే కాదు.. తనలోని మంచితనం ఎలా ఉంటుందనేది ప్రపంచానికి పరిచయం చేశాడు. సాధారణంగా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే పిచ్‌పై కవర్లను కప్పడం చూస్తాం. కానీ ఆ కవర్లు లాగడానికి గ్రౌండ్స్‌మెన్‌ చాలా కష్టపడతారు. చాలా బరువుండే దానికి గ్రౌండ్‌లోకి తీసుకురావడం కత్తిమీద సామే. ఆ కష్టం తెలిసినోడు కాబట్టే జాంటీ రోడ్స్‌ గ్రౌండ్స్‌మెన్‌కు తనవంతు సాయం చేశాడు. 

విషయంలోకి వెళితే... బుధవారం సీఎస్‌కే,లక్నో సూపర్‌జెయింట్స్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. లక్నో ఇన్నింగ్స్‌ సమయంలో వర్షం రావడంతో గ్రౌండ్‌ సిబ్బంది రెయిన్‌ టర్పైన్‌ కవర్లతో గ్రౌండ్‌లోకి వస్తున్నారు. ఇది గమనించిన జాంటీ రోడ్స్‌ వారితో పాటు కవర్‌ను లాగేందుకు యత్నించాడు. సిబ్బంది వద్దని వారించినా రోడ్స్‌ వినిపించుకోకుండా తన పని కానిచ్చాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వద్దు సార్‌... మేం చూసుకుంటాం అనగానే రోడ్స్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌​ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక లక్నో సూపర్‌జెయింట్స్‌, సీఎస్‌కే మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. లక్నో తొలి ఇన్నింగ్స్‌ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు స్పష్టం చేశారు. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి లక్నో సూపర్‌జెయింట్స్‌ 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులతో ఆడుతుంది. ఆయుష్‌ బదోని 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్‌ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. 

చదవండి: పని చేయని ధోని మంత్రం.. పూర్తిగా విఫలమయ్యాడు

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)