Breaking News

టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్‌..?

Published on Mon, 06/17/2024 - 18:08

టీమిండియా  తదుపరి ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ ఎంపిక కాబోతున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో అతని కోచింగ్‌ బృందంలోని సభ్యులను కూడా మారుస్తారన్న ప్రచారం జరుగుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టు తదుపరి ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాహుల్‌ బృందంలో ఫీల్డింగ్‌ కోచ్‌గా టి దిలీప్‌ ఉన్నాడు. ఒకవేళ ద్రవిడ్‌తో పాటు అతని సహాయ బృందం​ మొత్తం తప్పుకుంటే.. బీసీసీఐ కొత్త కోచింగ్‌ టీమ్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే, టీమిండియా తదుపరి హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్‌) చివరి వారంలో గంభీర్‌ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తన సపోర్టింగ్‌ స్టాఫ్‌ ఎంచుకునే విషయంలో గంభీర్‌ పూర్తి స్వేచ్చను ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. ఇందులో భాగంగా గంభీరే రోడ్స్‌ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. గంభీర్‌, రోడ్స్‌ 2022, 2023 ఐపీఎల్‌ సీజన్లలో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు సేవలందించారు. గంభీర్‌ మెంటార్‌, రోడ్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా లక్నో ఫ్రాంచైజీకి పని చేశారు. 

కోచ్‌గా తొలిసారి..
గంభీర్‌ భారత ఫుల్‌టైమ్‌ హెడ్‌ కోచ్‌గా నియమితుడైతే ఇదే అతనికి హెడ్‌ కోచ్‌గా మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్‌ గతంలో ఏ జట్టుకు ఫుల్‌టైమ్‌ హెడ్‌ కోచ్‌గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్‌లో మెంటార్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేశాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతో గంభీర్‌ పేరు టీమిండియా హెడ్‌ కోచ్‌ రేసులో ప్రధానంగా వినిపిస్తుంది.

 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)