Breaking News

బెయిర్ స్టో విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. కేవ‌లం 45 బంతుల్లోనే

Published on Sat, 04/27/2024 - 00:12

ఐపీఎల్‌-2024లో భాగంగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెన‌ర్ జానీ బెయిర్ స్టో విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 262 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో బెయిర్ స్టో.. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు.

ఈ క్ర‌మంలో బెయిర్ స్టో.. కేవ‌లం 45 బంతుల్లోనే త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ఫాస్టెస్ సెంచ‌రీ చేసి బెయిర్ స్టోకు ఇది రెండో ఐపీఎల్ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఓవ‌రాల్‌గా ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

కాగా అత‌డి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఫ‌లితంగా పంజాబ్‌ 262 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కేవ‌లం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. దీంతో  టీ20 క్రికెట్ చ‌రిత్రలోనే అత్య‌ధిక ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేజ్ చేసిన జ‌ట్టుగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో బెయిర్‌స్టోతో పాటు శశాంక్ సింగ్ (28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 పరుగులు), ప్రభుసిమ్రాన్ సింగ్‌(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)