Breaking News

ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడు

Published on Tue, 05/16/2023 - 16:19

ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు  15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. జూన్‌ 1న లండన్‌ వేదికగా ఈ టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. అదే విధంగా  కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడుతూ గాయపడ్డ ఆ జట్టు వెటరన్‌ పేసర్‌ జేమ్స్ ఆండర్సన్‌ ఫూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు.

దీంతో అతడికి ఐర్లాండ్‌తో టెస్టు జట్టులో చోటు దక్కింది. మరోవైపు కాలి గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి జట్టుకు దూరంగా ఉన్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో కూడా ఈ టెస్టుతో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టెస్టుల్లో ఇంగ్లండ్‌ వైస్‌ ‍కెప్టెన్‌గా ఆలీ పోప్‌ను సెలక్షన్‌ కమిటీ నియమించింది. 

ఐర్లాండ్‌తో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జేమ్స్ ఆండర్సన్, జొనాథన్ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఆలీ పోప్, మాథ్యూ పాట్స్, ఆలీ రాబిన్సన్, జో రూట్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
చదవండి: నేను బౌలింగ్‌ చేసి ఉంటే రాజస్తాన్‌ 40 పరుగులకే ఆలౌటయ్యేది: కోహ్లి

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)