Breaking News

ఇంగ్లండ్‌ జట్టుకు చేదు అనుభవం.. 38 గంటలు విమానంలోనే!

Published on Sat, 09/30/2023 - 07:36

వన్డే ప్రపంచకప్‌-2023 వార్మప్‌ మ్యాచ్‌లలో భాగంగా శనివారం  గౌహతి వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు గౌహతికి చేరుకున్నాయి. అయితే ఢిఫెండింగ్‌ చాంపియన్స్‌ ఇంగ్లండ్‌ జట్టుకు మాత్రం తమ ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లీష్‌ జట్టు తమ విమాన ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.

దాదాపు 38 గంటల పాటు ఆ జట్టు ఆటగాళ్లు ఎకానమీ క్లాస్‌లో విమానంలో ప్రయాణించారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు  జానీ బెయిర్‌స్టో సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్ నుంచి గువహతి వరకు ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించడంపై బెయిర్‌స్టో అసహనం వ్యక్తం చేశాడు.  వారు విమానంలో ప్రయాణిస్తున్న ఫోటోను  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

"అంతా గందరగోళంగా ఉంది. విమానంలోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు 38 గంటలకుపైగా ప్రయాణం సాగింది'' అంటూ నవ్వుతున్న ఎమోజిని క్యాప్షన్‌గా బెయిర్‌ స్టో పెట్టాడు.ఆ ఫోటోలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌, ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ఉన్నారు. వారిద్దరూ బాగా ఆలసిపోయినట్లు కన్పించారు.

అదే విధంగా వారి చూట్టూ తోటి ప్రయాణికులు భారీగా గుమిగూడి ఉన్నారు. కాగా సాధరణంగా ఆటగాళ్లు ఎక్కువగా బిజినెస్‌ క్లాస్‌లోనే ప్రయాణిస్తారు. కానీ ఇంగ్లండ్‌ జట్టు విషయంలో ఎందుకు ఇలా జరిగిందో కారణం తెలియలేదు. ఇక ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గాస్ అట్కిన్‌సన్, జానీ బెయిర్‌స్టో, హారీ బ్రూక్, సామ్‌ కరన్, లియామ్‌ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, అదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, మార్క్‌ వుడ్, క్రిస్‌ వోక్స్}
చదవండి:
 పరుగుల జోరులో కివీస్‌దే పైచేయి

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)