Breaking News

స్పిన్‌ పిచ్‌లే సిద్ధం చేస్తే... 

Published on Sun, 01/07/2024 - 04:28

ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టు అన్నీ స్పిన్‌ పిచ్‌లే తయారు చేస్తుందని భావించడం లేదని ఆ జట్టు సీనియర్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం భారత పేస్‌ బౌలింగ్‌ దళం చాలా పటిష్టంగా ఉందని, అన్నీ స్పిన్‌ పిచ్‌లే ఉంటే వారి ప్రభావం తగ్గిపోతుందని అతను అన్నాడు. భారత్‌లో జరిగిన గత సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో బెయిర్‌స్టో మూడు సార్లు డకౌటయ్యాడు.

‘సిరీస్‌లో మాకు వేర్వేరు తరహాలో పిచ్‌లు ఎదురవడం ఖాయం. అయితే అన్నీ టర్న్‌ కాకపోవచ్చు.  వారి పేస్‌ బౌలింగ్‌ ఇటీవల ఎలా ఉందో మేం చూస్తున్నాం. ఇప్పుడు పేస్‌ కూడా వారి బలం కాబట్టి తొలి రోజునుంచే టర్న్‌ అయ్యే పిచ్‌లు తయారు చేయకపోవచ్చు. అయితే ఎలా ఉన్నా పరిస్థితులకు తగినట్లుగా మా బ్యాటింగ్‌ను మార్చుకునేందుకు మేం సిద్ధంగా ఉండాలి.

అశ్విన్, జడేజా, అక్షర్‌... ఇలా బౌలర్‌ ఎవరైనా కావచ్చు. మేం అతిగా ఆలోచించడం లేదు. గత సిరీస్‌లో చెన్నైలో మేం కూడా టెస్టు మ్యాచ్‌ గెలిచామనే సంగతి మరచిపోవద్దు’ అని బెయిర్‌స్టో చెప్పాడు. 2021లో జరిగిన సిరీస్‌ను భారత్‌ 3–1తో సొంతం చేసుకుంది.  

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)