Breaking News

పుండు మీద కారం చల్లినట్లు..హెడ్‌కోచ్‌, ఆటగాడిని శిక్షించిన ఐసీసీ

Published on Tue, 07/18/2023 - 11:05

రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్‌.. బంగ్లాదేశ్‌కు కోల్పోయిన సంగతి తెలిసిందే. సిరీస్‌ ఓటమితో బాధలో ఉన్న ఆఫ్గన్‌కు మరో గట్టిషాక్‌ తగిలింది. జట్టు హెడ్‌కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌తో పాటు ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్‌జైయ్‌లకు ఐసీసీ శిక్షించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి(Code Of Conduct) లెవెల్‌-1 నిబంధన ఉల్లఘించినందుకు గానూ ఇద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకుంది.

వర్షం అంతరాయం కలిగించిన సమయంలో ఫీల్డ్‌ అంపైర్లు పిచ్‌ను పరిశీలించడానికి ఇన్‌స్పెక్షన్‌కు వచ్చారు. ఈ సమయంలో కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ అంపైర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్టాడినట్లు తెలిసింది. ఈ మేరకు ఫీల్డ్‌ అంపైర్లు కోచ్‌ ట్రాప్‌పై రిఫరీకి ఫిర్యాదు చేశారు.

ఇక ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ తౌహిర్‌ హృదయ్‌ను ఔట్‌ చేశాకా.. అజ్మతుల్లా ఒమర్‌జైయ్‌ హృదయ్‌ను టార్గెట్‌ చేస్తూ పరుష పదజాలం ఉపయోగిస్తూ పెవిలియన్‌ వైపు చేతిని చూపెట్టాడు. ఇది స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. దీంతో ఆర్టికల్‌ 2.5 ప్రకారం అజ్మతుల్లా ఐసీసీ నియమావళి నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. 

ఇద్దరికి ఇదే తొలి తప్పుగా భావించిన ఐసీసీ ఒక డీమెరిట్‌ పాయింట్‌ విధించింది. 24 నెలల్లో మరోసారి ఇదే తప్పు చేస్తే మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్‌ పాయింట్స్‌ విధించే అవకాశం ఉంటుంది.

ఇక షెల్లాట్‌ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో(డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి) బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో బంగ్లాదేశ్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను తొలుత 17 ఓవర్లకు కుదించారు. మొదటి బ్యాటింగ్‌ చేసిన ఆఫ్గానిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.

అజ్మతుల్లా జజాయ్‌ 25 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో టాస్కిన్‌ అహ్మద్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజర్‌ రెహమన్‌, షకీబ్‌ అల్ హసన్‌లు‌ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో బంగ్లాదేశ్‌ టార్గెట్‌ను 119 పరుగులగా నిర్ణయించారు.

119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 4 వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా ఛేజింగ్‌లో లిటన్‌ దాస్‌(35), షకీబ్‌(18 నాటౌట్‌) కీలక పాత్ర పోషించారు. ఇక సిరీస్‌ విజయంతో వన్డే సిరీస్‌ ఓటమికి బంగ్లాదేశ్‌ బదులు తీర్చకున్నట్లైంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో ఆఫ్గాన్‌ సొంతం చేసుకుంది.

చదవండి: #MLC2023: దంచికొట్టిన సీఎస్‌కే ఓపెనర్.. సూపర్‌కింగ్స్‌కు రెండో విజయం

CWG 2026: 'అంత బడ్జెట్‌ మావల్ల కాదు'.. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహించలేం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)