Breaking News

అర్జున్‌ నయం.. ఆర్చర్‌ను నమ్మి తప్పు చేశాడా!

Published on Wed, 05/03/2023 - 21:28

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. బుధవారం పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లు ఆర్చర్‌ బౌలింగ్‌ను ఒక ఆట ఆడుకున్నారు. 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఆర్చర్‌ 56 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. పైగా ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు.

ఆర్చర్‌ వీక్‌నెస్‌ ఏంటో తెలిసిన లివింగ్‌స్టోన్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో స్వాగతం పలికాడు. దీంతో దెబ్బకు ఆర్చర్‌ ఐపీఎల్‌లో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో వికెట్‌ లేకుండా అత్యధిక పరుగులు సమర్పించుకోవడం ఆర్చర్‌కు ఇదే తొలిసారి. 

అసలు వేస్తుంది ఆర్చరా లేక దేశవాలీ క్రికెటర్‌ ఎవరైనానా అన్న సందేహం కలిగింది. ఏ మాత్రం పసలేని బౌలింగ్‌తో ఆర్చర్‌ ముంబై ఇండియన్స్‌ను ముంచాడు. జాసన్‌ బెహండార్ఫ్‌ను కాదని ఆర్చర్‌ను నమ్మి రోహిత్‌ తప్పు చేశాడు. పూర్తిగా గతి తప్పిన బౌలింగ్‌తో ఆర్చర్‌ మ్యాచ్‌లో ఇబ్బందులు ఎదుర్కోవడం స్పష్టంగా కనిపించింది.

ఇక ఆర్చర్‌ బౌలింగ్‌ చూశాకా అర్జున్‌ టెండూల్కర్‌ నయం అని చాలామంది అభిమానులు అభిప్రాయపడ్డారు. మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్‌ 9.3 ఎకానమీతో మూడు వికెట్లు తీశాడు. అయితే ఆర్చర్‌తో పోలిస్తే అర్జున్‌ బౌలింగ్‌ బెటర్‌గా ఉందని.. అతనికి అవకాశం ఇచ్చినా బాగుండేదని పేర్కొన్నారు.

చదవండి: సమయం వస్తే ధోనినే చెప్తాడు.. ప్రతీసారి ఎందుకీ చర్చ!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)