Breaking News

శతక్కొట్టిన జో రూట్‌.. 12 ఏళ్ల నిరీక్షణకు తెర

Published on Thu, 12/04/2025 - 17:14

ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్‌.. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై త‌న టెస్టు సెంచ‌రీ నిరీక్ష‌ణ‌కు తెర‌దించాడు. గత 12 ఏళ్ల ప్రయత్నిస్తున్న జోరూట్‌ ఎట్టకేలకు తన కలను నేరవేర్చుకున్నాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదిక‌గా ఆసీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో రూట్ సెంచ‌రీతో చెల‌రేగాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్ జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు.

ఓపెనర్ జాక్ క్రాలీతో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో రూట్ 181 బంతుల్లో తన 40వ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఇది అతడికి 59వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఈ ఇంగ్లీష్ వెటరన్ బ్యాటర్ 2025 ఏడాదిలో  ఇప్పటికే 4 టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు. రూట్‌ ప్రస్తుతం 135 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. 

తొలి రోజు ఇంగ్లండ్‌దే..
యాషెస్‌ రెండో టెస్టు తొలి రోజు ఆటలో కంగారుల జట్టుపై ఇంగ్లండ్‌ పై చేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రూట్‌తో పాటు ఆర్చర్‌(32 నాటౌట్‌) ఉన్నాడు.

వీరిద్దరూ పదో వికెట్‌కు 61 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. మిచెల్‌ స్టార్క్‌ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్‌ తొలి రోజే ఆలౌటైట్లు కన్పించింది. కానీ రూట్‌, ఆర్చర్‌ ఆఖరి వికెట్‌ కోల్పోకుండా పోరాడారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ మరోసారి ఆరు వికెట్లు పడగొట్టగా.. నసీర్‌, బోలాండ్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IND vs SA: సొంత తెలివితేటలు వద్దు.. చెబితే నీకు అర్ధం కావడం లేదా?

 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)