Breaking News

జో రూట్‌ అరుదైన ఘనత.. ద్రవిడ్‌ రికార్డు బద్దలు! సచిన్‌కు చేరువలో

Published on Sun, 08/25/2024 - 09:32

ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్ త‌న అద్భుత ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. మాంచెస్ట‌ర్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టెస్టులో రూట్ స‌త్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 ప‌రుగులు రాణించిన రూట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఆజేయ హాఫ్ సెంచ‌రీ సాధించాడు.

128 బంతుల్లో 2 ఫోర్లు సాయంతో అత‌డు 62 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొద‌టి టెస్టులో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించ‌డంలో ఈ వెట‌రన్ త‌న వంతు పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో శ్రీలంక‌ను ఇంగ్లండ్ చిత్తుచేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి ఇంగ్లండ్ వెళ్లింది.

జో రూట్ అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో మెరిసిన జో రూట్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టుల్లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన మూడో ఆట‌గాడిగా రూట్ రికార్డుల‌కెక్కాడు. ఇప్ప‌టివ‌ర‌కు 144 టెస్టులు ఆడిన రూట్‌.. 64 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గ‌జం అలాన్ బోర్డర్(63), భార‌త మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌(63)ల పేరిట‌ సంయుక్తంగా ఉండేది.

 తాజా మ్యాచ్‌తో వీరిద్ద‌రని అధిగ‌మించి మూడో స్ధానానికి రూట్ చేరుకున్నాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌(68) అగ్ర‌స్ధానంలో ఉండ‌గా.. విండీస్ లెజెండ్ చంద్ర‌పాల్‌(66) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రూట్ కెరీర్‌లో 32 టెస్టు సెంచ‌రీలు ఉన్నాయి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)