Breaking News

వారెవ్వా రూట్‌.. ద్ర‌విడ్ వ‌ర‌ల్డ్ రికార్డు స‌మం

Published on Tue, 06/24/2025 - 09:36

ఇంగ్లండ్ స్టార్ బ్యా టర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక  క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ రికార్డును రూట్ సమం చేశాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు.

నాలుగో రోజు ఆటలో శార్థూల్ ఠాకూర్ క్యాచ్‌ను అందుకున్న జో.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్‌, ద్రవిడ్ ఇద్దరూ సమానంగా చెరో 210 అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లను అందుకున్నారు. ద్రవిడ్ ఈ వరల్డ్ రికార్డును 164 టెస్టుల్లో సాధించగా.. రూట్ 154 మ్యాచ్‌లలోనే ఈ  రేర్‌ఫీట్‌ను సమం చేశాడు.

ఈ సిరీస్‌లో రూట్ మరో క్యాచ్‌ను అందుకుంటే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు. ఈ రికార్డు సాధించిన జాబితాలో ద్రవిడ్‌, రూట్ తర్వాత స్ధానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే(205 అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు) ఉన్నారు. అయితే టెస్టుల్లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీప‌ర్‌గా ద‌క్షిణాఫ్రికా లెజెండ్ మార్క్ బౌచ‌ర్‌(532) అగ్ర‌స్దానంలో ఉన్నాడు.

గెలుపువరిదో?
ఇక ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఇం‍గ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 ప‌రుగులు చేసింది. 

ఇం‍గ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 ప‌రుగులు కావాలి. భారత్‌ తమ విజయానికి పది వికెట్ల దూరంలో నిలిచింది. అంత‌కుముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 90/2 తో రెండో ఇన్నింగ్స్ కొన‌సాగించిన భార‌త్.. 96 ఓవ‌ర్ల‌లో 364 ప‌రుగుల‌కు ఆలౌటైంది.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)