చరిత్ర సృష్టించిన జో రూట్‌

Published on Sun, 01/25/2026 - 15:56

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ కెరీర్‌లో మరో ఘనతను సొంతం​ చేసుకున్నాడు. నిన్న (జనవరి 24) శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో (2.3-0-13-2, ఓ క్యాచ్‌, (90 బంతుల్లో 72; 5 ఫోర్లు)) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు గెలుచుకున్న అతడు.. 

ఇంగ్లండ్ తరఫున అత్యధిక POTM అవార్డులు (383 మ్యాచ్‌ల్లో 27) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో కెవిన్‌ పీటర్సన్‌ (277 మ్యాచ్‌ల్లో 26) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో రూట్‌, కేపీ తర్వాత జోస్‌ బట్లర్‌ (24), ఇయాన్‌ మోర్గాన్‌ (23) ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. రూట్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది. 

నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 27న కొలొంబో వేదికగానే జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య పల్లెకెలె వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ తర్వాత శ్రీలంకతో పాటు భారత్‌లో ప్రపంచకప్‌ మొదలవుతుంది.

ఎనిమిది మందితో ప్రయోగం
టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించింది. తలో చేయి వేయడంతో శ్రీలంక 49.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌, రూట్‌ తలో 2 వికెట్లు తీయగా.. డాసన్‌, జాక్స్‌, రెహాన్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్‌లో ధనంజయ డిసిల్వ (40), అసలంక (45) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

రాణించిన రూట్‌
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడినప్పటికీ.. రూట్‌ (75), బ్రూక్‌ (42), డకెట్‌ (39), బట్లర్‌ (33 నాటౌట్‌) బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టును గెలిపించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, వాండర్సే తలో 2, అషిత ఫెర్నాండో ఓ వికెట్‌ పడగొట్టారు.

 

Videos

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)