టీమిండియాతో నాలుగో టెస్టు.. చ‌రిత్రకు అడుగు దూరంలో జో రూట్‌

Published on Sat, 07/19/2025 - 15:41

సొంత గ‌డ్డ‌పై టీమిండియాతో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్ దుమ్ములేపుతున్నాడు. లార్డ్స్‌ టెస్టులో అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగిన రూట్‌.. ఇప్పుడు మాంచెస్ట‌ర్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్టులో కూడా స‌త్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో జోరూట్ ఓ అరుదైన రికార్డుపై క‌న్నేశాడు.

డేంజ‌ర్‌లో పాంటింగ్ రికార్డు.. 
మాంచెస్ట‌ర్‌లో రూట్ మ‌రో 119 ప‌రుగులు సాధిస్తే..టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన రెండో ఆట‌గాడిగా రూట్ నిలుస్తాడు. రూట్ ఇప్ప‌టివ‌ర‌కు 156 టెస్టులు 50.8 స‌గ‌టుతో 13259 ప‌రుగులు చేశాడు.టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో రూట్ ప్ర‌స్తుతం నాలుగో స్ధానంలో ఉన్నాడు.

రూట్ కంటే ముందు రాహుల్ ద్ర‌విడ్‌(13288), జాక్వ‌స్ క‌ల్లిస్‌(13289), రికీ పాంటింగ్‌(13378), స‌చిన్ టెండూల్క‌ర్‌(15921) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గాని ఆఖరి టెస్టులో గాని ద్ర‌విడ్‌, క‌ల్లిస్‌, పాంటింగ్‌ను రూట్ అధగ‌మించే అవ‌కాశ‌ముంది. ఇక అగ్ర‌స్దానంలో కొన‌సాగుతున్న స‌చిన్‌ను ఆధిగ‌మించేందుకు రూట్ ఇంకా 2,662 ప‌రుగుల దూరంలో ఉన్నాడు.

అయితే 34 ఏళ్ల రూట్ మ‌రి కొన్నాళ్ల పాటు టెస్టుల్లో కొన‌సాగితే స‌చిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఐదు టెస్టుల ఆండర్సన్‌- టెండూల్కర్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌ ప్రస్తుతం 1-2 ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: WCL 2025: అన్నా.. నీవు ఇప్ప‌టికి మారలేదా? పాక్ ఆట‌గాడిపై సెటైర్‌లు

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)