Breaking News

రూట్‌ అరుదైన ఘనత.. యాషెస్‌ చరిత్రలో మూడో ఆటగాడిగా

Published on Thu, 06/29/2023 - 14:47

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌ ఇటీవలీ కాలంలో తన ఆటను పూర్తిగా మార్చేశాడు. ఒకప్పుడు టెస్టులు, వన్డే క్రికెట్‌పై మాత్రమే ఎక్కువగా ఫోకస్‌ చేసిన రూట్‌ టి20ల్లోనూ తన పాగా వేసేందుకు ఆటశైలిని మార్చాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ఫలితం ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా వచ్చినప్పటికి రూట్‌ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 

ఒక మంచి బ్యాటర్‌గా పేరు పొందిన రూట్‌ ఈ మధ్య కాలంలో బౌలర్‌గానూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌ అవతారం ఎత్తినట్లుగా అనిపిస్తున్నాడు. తాజాగా లార్డ్స్‌ వేదికగా మొదలైన రెండో టెస్టులో తొలి రోజే తన బౌలింగ్‌ మాయాజాలన్ని ప్రదర్శించాడు. ప్రధాన బౌలర్లకు తీసిపోని విధంగా ప్రదర్శన చేసిన రూట్.. ఆసీస్‌ ప్రధాన బ్యాటర్లు కామెరూన్‌ గ్రీన్‌, ట్రెవిస్‌ హెడ్‌లు ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ఈ నేపథ్యంలో రూట్‌ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

అదేంటంటే.. యాషెస్‌ చరిత్రలో బ్యాటింగ్‌లో 2వేల పరుగులు పూర్తి చేయడంతో పాటు 20 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా రూట్‌ చరిత్రకెక్కాడు. ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌(2172 పరుగులు, 74 వికెట్లు), ఇంగ్లండ్‌కు చెందిన వాలీ హామండ్‌(2852 పరుగులు, 36 వికెట్లు) పడగొట్టారు.

ఇక​ తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. స్మిత్‌ 85 పరుగులు నాటౌట్‌ మరో సెంచరీ వైపు దూసుకెళుతుండగా.. అలెక్స్‌ కేరీ 11 పరుగులతో స్మిత్‌కు సహకరిస్తున్నాడు. అంతకముందు ట్రెవిస్‌ హెడ్‌(77 పరుగులు), డేవిడ్‌ వార్నర్‌(66 పరుగులు) వన్డే తరహాలో ఆడారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జో రూట్‌, జోష్‌ టంగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఓలి రాబిన్సన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

చదవండి: పిచ్‌ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్‌ స్టో

అరుదైన మైలురాయిని దాటిన స్టీవ్‌ స్మిత్‌.. ఇతని కంటే కోహ్లి ఒక్కడే బెటర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)