ఇంగ్లండ్‌ తదుపరి టెస్ట్‌ కెప్టెన్‌ అతడే?

Published on Fri, 07/24/2026 - 17:42

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు  కెప్టెన్సీ బాధ్యతలను సీనియర్ బ్యాటర్ జో రూట్ మరోసారి చేపట్టే అవకాశముంది.  న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, స్టార్ ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో త‌మ టెస్టు జ‌ట్టు ప‌గ్గాల‌ను సీనియ‌ర్ బ్యాట‌ర్ జోరూట్‌కు మ‌రోసారి అప్ప‌గించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ హోమ్ సిరీస్ వరకు రూట్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా కొన‌సాగించాల‌ని ఈసీబీ భావిస్తున్న‌ట్లు'ది అథ్లెటిక్' తమ కథనంలో పేర్కొంది. అతడి డిప్యూటీగా హ్యారీ బ్రూక్‌ వ్యవహరించనున్నాడు.

కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో కూడా ఇంగ్లండ్ కెప్టెన్‌గా రూట్ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ ఇంగ్లీష్‌ 253 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చూసింది. ఈ మ్యాచ్ ఫలితం పక్కన పెడితే జో రూట్‌కు కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉంది.

రూట్ గతంలో 2017 ఫిబ్రవరి నుంచి 2022 ఏప్రిల్ వరకు సుదీర్ఘకాలం పాటు ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు సారథ్యం వహించారు. రూట్ మొత్తం 65 టెస్టుల్లో ఇంగ్లాండ్‌ను నడిపించగా.. అందులో 27 విజయాలు, 27 ఓటములు ఉన్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌ల్లో గెలిపించిన కెప్టెన్‌గా, అలాగే అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కెప్టెన్‌గా రెండూ రూట్ పేరిటే ఉండటం గమనార్హం. 

ఆటగాడిగా రూట్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో రూట్ (14,114*) రెండో స్ధానంలో ఉన్నాడు. అగ్ర‌స్ధానంలో ఉన్న‌ సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) కంటే రూట్‌ కేవ‌లం 1,808 పరుగుల దూరంలో ఉన్నాడు.

కాగా కివీస్‌తో సిరీస్ అనంత‌రం బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌ను కూడా టెస్ట్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి ఈసీబీ త‌ప్పించింది. అత‌డి స్దానంలో మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోథిక్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇంగ్లండ్ త‌మ తదుప‌రి సిరీస్‌లో స్వ‌దేశంలో మూడు టెస్ట్‌లు ఆడ‌నుంది.

#

Tags : 1

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)