Breaking News

జో రూట్‌ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా

Published on Sat, 03/09/2024 - 21:26

ఇంగ్లండ్‌ వెటరన్‌ బ్యాటర్‌ జో రూట్‌ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా రూట్‌ రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో 84 పరుగులు చేసిన రూట్‌.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్‌ ఇప్పటివరకు భారత్‌పై టెస్టుల్లో 21 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు.

కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ పేరిట ఉండేది. పాంటింగ్‌ భారత్‌పై 20 సార్లు ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో పాంటింగ్‌ ఆల్‌టైమ్‌ రికార్డును రూట్‌ బ్రేక్‌ చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. భారత్‌ చేతిలో ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్‌ జట్టు ఓటమి పాలైంది. 

భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.  ఇక  ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
చదవండి: IND vs ENG: రిటైర్మెంట్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)