చ‌రిత్ర సృష్టించిన జో రూట్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Published on Fri, 05/23/2025 - 00:01

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో మ్యాచ్‌లు పరంగా అత్యంతవేగంగా 13000 పరుగుల మైలు రాయిని అందుకున్న బ్యాటర్‌గా రూట్ చరిత్ర సృష్టించాడు. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో టెస్టులో 28 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద రూట్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ రేర్ ఫీట్‌ను రూట్ కేవలం 153 మ్యాచ్‌లలో నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ పేరిట ఉండేది. కల్లిస్ 159 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. తాజా మ్యాచ్‌తో కల్లిస్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. కల్లిస్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్(160), రికీ పాంటింగ్‌(162), సచిన్ టెండూల్కర్(163)ను అధిగమించాడు.

అయితే మ్యాచ్‌ల పరంగా మాత్రం ఈ ఫీట్‌ సాధించిన జాబితాలో సచిన్(266) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రూట్‌(279 మ్యాచ్‌లు) ఐదో స్ధానంలో ఉన్నారు. ఇక టెస్టుల్లో 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లీష్ క్రికెటర్ కూడా జో రూట్‌నే కావడం గమనార్హం. 

ఇక  ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. క్రీజులో పోప్‌(169), బ్రూక్‌(9) ఉన్నారు. అంతకుముందు డకెట్‌(140), క్రాలీ(124) సెంచరీలు సాధించారు

 

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)