ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ మెంటార్‌గా జేమ్స్‌ ఆండర్సన్‌

Published on Tue, 07/02/2024 - 08:59

ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజం, ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ జేమ్స్‌ ఆండర్సన్‌.. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే టెస్ట్‌ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పనున్నాడు. ఆండర్సన్‌ రిటైరయ్యాక కూడా ఇంగ్లండ్‌ జట్టుతోనే కొనసాగనున్నాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఆండర్సన్‌ను ఫాస్ట్‌ బౌలింగ్‌ మెంటార్‌గా నియమించింది. తన చివరి టెస్ట్‌ ముగిసిన వెంటనే ఆండర్సన్‌ కొత్త బాధ్యతలు చేపడతాడు.

ఇంగ్లండ్‌.. జులై 10 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. జులై 10, 18, 26 తేదీల్లో మూడు మ్యాచ్‌లు మొదలవుతాయి. లార్డ్స్‌, ట్రెంట్‌బ్రిడ్జ్‌, ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. లార్డ్స్‌లో  జరుగబోయే టెస్ట్‌తో ఆండర్సన్‌ రిటైర్‌ కానున్నాడు. ఆండర్సన్‌ బౌలింగ్‌ మెంటార్‌గా తన ప్రస్తానాన్ని విండీస్‌తో రెండో టెస్ట్‌ నుంచి మొదలుపెడతాడు.

జట్ల వివరాలు..

ఇంగ్లండ్‌ (తొలి రెండు టెస్ట్‌లకు): హ్యారీ బ్రూక్‌, జో రూట్‌, డేనియల్‌ లారెన్స్‌, జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), క్రిస్‌ వోక్స్‌, ఓలీ పోప్‌, జేమీ స్మిత్‌, జేమ్స్‌ ఆండర్సన్‌ (తొలి టెస్ట్‌కు మాత్రమే), గస్‌ అట్కిన్సన్‌, షోయబ్‌ బషీర్‌, డిల్లన్‌ పెన్నింగ్టన్‌, మ్యాట్‌ పాట్స్‌

వెస్టిండీస్‌: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), కవెమ్‌ హాడ్జ్‌, అలిక్‌ అథనాజ్‌, జకరీ మెక్‌క్యాస్కీ, జేసన్‌ హోల్డర్‌, కిర్క్‌ మెక్‌కెంజీ, జాషువ డసిల్వ, టెవిన్‌ ఇమ్లాక్‌, అల్జరీ జోసఫ్‌, షమార్‌ జోసఫ్‌, మిఖైల్‌ లూయిస్‌, గుడకేశ్‌ మోటీ, జేడన్‌ సీల్స్‌, కెవిన్‌ సింక్లెయిర్‌, జెర్మియా లూయిస్‌

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)