Breaking News

సలీల్‌ అరోరా సూపర్‌ సెంచరీ

Published on Sat, 12/13/2025 - 03:23

అంబి (మహారాష్ట్ర): పంజాబ్‌ యువ బ్యాటర్‌ సలీల్‌ అరోరా (45 బంతుల్లో 125 నాటౌట్‌; 9 ఫోర్లు, 11 సిక్స్‌లు) సూపర్‌ సెంచరీతో చెలరేగినా... పంజాబ్‌ జట్టుకు పరాజయం తప్పలేదు. దేశవాళీ టి20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ‘సూపర్‌ లీగ్‌’ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్‌ జట్టు 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. 

స్టార్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... అతడు లేని లోటును అరోరా భర్తీ చేశాడు. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్న చందంగా చెలరేగిపోయాడు. మిగిలిన వారి నుంచి చెప్పుకోదగ్గ తోడ్పాటు లభించకపోయినా... అరోరా ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో అతడు 39 బంతుల్లోనే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. కెపె్టన్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (10), హర్‌నూర్‌ సింగ్‌ (13), సాన్‌వీర్‌ సింగ్‌ (10), రమణ్‌దీప్‌ సింగ్‌ (8) విఫలం కాగా... అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్‌ (23), నమన్‌ ధిర్‌ (27) ఫర్వాలేదనిపించారు. 

జార్ఖండ్‌ బౌలర్లలో సుశాంత్‌ మిశ్రా, బాలకృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జార్ఖండ్‌ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెపె్టన్‌ ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ సింగ్‌ (18; 1 ఫోర్, 2  సిక్స్‌లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చారు. సాధించాల్సిన రన్‌రేట్‌ కొండంత ఉన్న జార్ఖండ్‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ కుమార్‌ కుశాగ్ర (42 బంతుల్లో 86 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... చివర్లో అనుకూల్‌ రాయ్‌ (17 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పంకజ్‌ కుమార్‌ (18 బంతుల్లో 39 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. జార్ఖండ్‌ బ్యాటర్లలో రాబిన్‌ మింజ్‌ (2) మినహా తక్కిన వాళ్లంతా రెండొందల పైచిలుకు స్ట్రయిక్‌ రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం. ఐపీఎల్‌ మినీ వేలానికి ముందు యువ ఆటగాళ్లు తమ పవర్‌హిట్టింగ్‌తో ఫ్రాంచైజీల దృష్టిలో పడే ప్రయత్నంలో ఉన్నారు.  

అంకిత్‌ కుమార్‌ అర్ధసెంచరీ 
‘సూపర్‌ లీగ్‌’ గ్రూప్‌ ‘బి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో హరియాణా జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గెలిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మహిపాల్‌ లోమ్రర్‌ (39 బంతుల్లో 37 నాటౌట్‌; 1 ఫోర్‌), శుభమ్‌ గర్వాల్‌ (27 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. దీపక్‌ హుడా (0), కునాల్‌ సింగ్‌ రాథోడ్‌ (4), కరణ్‌ లాంబా (1), కెపె్టన్‌ మానవ్‌ సుతార్‌ (15) విఫలమయ్యారు. 

హరియాణా బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాంత్‌ భరద్వాజ్, అన్షుల్‌ కంబోజ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో హరియాణా 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. కెప్టెన్ అంకిత్‌ కుమార్‌ (41 బంతుల్లో 60; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో మెరవగా... అర్ష్ రంగా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పార్థ్‌ వత్స్‌ (29 బంతుల్లో 27; 1 ఫోర్‌ 1 సిక్స్‌) రాణించారు. ఆదివారం జరగనున్న తదుపరి మ్యాచ్‌ల్లో ముంబైతో హరియాణా, ఆంధ్రతో పంజాబ్, హైదరాబాద్‌తో రాజస్తాన్, మధ్యప్రదేశ్‌తో జార్ఖండ్‌ తలపడతాయి.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)