Breaking News

టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విధ్వంసకర సెంచరీ

Published on Fri, 11/06/2026 - 21:26

టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే అద‌ర‌గొట్టింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ-2026లో ముంబై జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న జెమీమా.. శుక్ర‌వారం  పాండిచ్చేరి మహిళలతో జ‌రిగిన మ్యాచ్‌లో విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగింది. 

మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన జెమీమా త‌నదైన శైలిలో పాండిచ్చేరి బౌల‌ర్ల‌ను ఉతికిపారేసింది. కేవలం 49 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సహాయంతో అజేయంగా 107 పరుగులు సాధించింది. ఓపెన‌ర్ హుమైరా కాజీతో కలిసి రెండో వికెట్‌కు కేవలం 86 బంతుల్లోనే 166 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కాగా ది హండ్రెడ్ 2026 టోర్నీలో భాగంగా జెమీమీ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైంది. దీంతో ఆమె గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉంటూ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించింది. ఈ గాయం కార‌ణంగానే మ‌హిళ‌ల ఆసియాక‌ప్‌-2026, ఆసియా క్రీడలకు (జపాన్) దూరమవ్వాల్సి వచ్చింది.  

అదేవిధంగా జింబాబ్వేతో వైట్ బాల్ సిరీస్‌ల‌కు కూడా జెమీమా అందుబాటులో లేదు.  అయితే ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో ఒక టెస్ట్‌, మూడు వ‌న్డేలు, మూడు టీ20ల్లో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ టూర్‌తో జెమీమా తిరిగి పున‌రాగ‌మ‌నం చేసే అవ‌కాశ‌ముంది.
చదవండి: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ పేసర్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)