Jasprit Bumrah: ‘విజయావకాశాలు 35% తగ్గుతాయి’

Published on Thu, 02/06/2025 - 03:48

దుబాయ్‌: భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనడం ఇంకా సందేహంగానే ఉంది. ఆ్రస్టేలియాతో చివరి టెస్టులో వెన్నునొప్పితో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయని బుమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అతను ఎంతవరకు కోలుకున్నాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటాడని చెబుతున్నా దానిపైనా సందేహాలు ఉన్నాయి. 

భారత జట్టుకు సంబంధించి అతని బౌలింగ్‌ విలువ ఎంత అమూల్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైతే టీమిండియా బలహీనంగా మారిపోవచ్చు. మాజీ ఆటగాడు రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. బుమ్రా గైర్హాజరు చాలా ప్రభావం చూపిస్తుందని అతను వ్యాఖ్యానించాడు. ‘బుమ్రా ఫిట్‌గా లేకపోతే భారత జట్టు విజయావకాశాలు చాలా తగ్గిపోతాయి. 

సరిగ్గా చెప్పాలంటే 30–35 శాతం వరకు గెలుపుపై ప్రభావం పడుతుంది. అతను పూర్తి ఫిట్‌గా ఉండి బరిలోకి దిగితే ఆట స్వరూపమే మారిపోతుంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో అతను కచ్చితంగా చెలరేగి గెలిపించగలడు. అయితే బుమ్రాను ఆడించే విషయంలో తొందర పడవద్దు. లేకపోతే గాయం తీవ్రత మరింత పెరిగిపోతుంది. కెరీర్‌ కీలక దశలో ఉన్న అతను రాబోయే రోజుల్లో ఎంతో ఆడాల్సి ఉంది. అలాంటివాడిని ఒక్కసారిగా పిలిపించి గెలిపించమని కోరడం సరైంది కాదు. బుమ్రా చాలా విలువైనవాడు.

అతనిపై అంచనాలూ భారీగా ఉంటాయి. వచ్చి రాగానే చెలరేగిపోవాని అంతా కోరుకుంటారు. నాకు తెలిసి గాయంనుంచి కోలుకొని వచ్చి అలా ఆడటం సాధ్యం కాదు’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మొహమ్మద్‌ షమీపై అందరి దృష్టీ ఉంటుందని...అతని ఫిట్‌నెస్‌కు కూడా ఇది పరీక్ష కానుందని కూడా భారత మాజీ కోచ్‌ అభిప్రాయ పడ్డాడు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)