Breaking News

రిలాక్స్‌.. నా ప‌ని నాకు బాగా తెలుసు: కోచ్‌ మాట వినని బుమ్రా

Published on Sat, 05/31/2025 - 14:13

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌ ఫైన‌ల్‌కు చేరేందుకు ముంబై ఇండియ‌న్స్ అడుగు దూరంలో నిలిచింది. శుక్ర‌వారం జ‌రిగిన ఎలిమినేట‌ర్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను 20 ప‌రుగుల తేడాతో ఓడించిన ముంబై.. క్వాలిఫ‌య‌ర్‌-2కు ఆర్హ‌త సాధించింది. ఆదివారం జ‌ర‌గ‌నున్న సెకెండ్ క్వాలిఫ‌య‌ర్‌లో పంజాబ్ కింగ్స్‌తో హార్దిక్ సేన అమీతుమీ తెల్చుకోనుంది. కాగా ఎలిమినేట‌ర్‌లో ముంబై విజ‌యం సాధించ‌డంలో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాది కీల‌క పాత్ర‌.

తీవ్ర ఒత్తిడిలో కూడా బుమ్రా త‌న అద్భుత బౌలింగ్‌తో ముంబైను గెలుపు తీరాల‌కు చేర్చాడు. 229 భారీ ల‌క్ష్య చేధ‌నలో ప‌వ‌ర్ ప్లేలోనే కెప్టెన్ శ‌బ్‌మ‌న్‌ గిల్‌, మెండిస్ వికెట్ల‌ను గుజ‌రాత్ కోల్పోయిన‌ప్ప‌టికి.. సాయిసుద‌ర్శ‌న్‌(80), వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(48) ముంబై బౌల‌ర్ల‌పై విరుచుప‌డ్డారు.

వీరిద్ద‌రూ దూకుడుగా ఆడుతూ గుజ‌రాత్‌ను ల‌క్ష్యానికి చేరువ చేశారు. సుంద‌ర్‌, సాయి విధ్వంసం ఫ‌లితంగా టైటాన్స్ 13 ఓవ‌ర్ల‌లో 150 ప‌రుగుల మార్క్‌కు చేరువైంది. దీంతో ముంబై డౌగట్‌తో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ క్ర‌మంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. 14 ఓవ‌ర్ వేసేందుకు బుమ్రాను తిరిగి ఎటాక్‌లో తీసుకొచ్చాడు. కెప్టెన్ న‌మ్మకాన్ని బుమ్‌బుమ్ బుమ్రా వ‌మ్ము చేయ‌లేదు.

 ఆ ఓవ‌ర్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను బుమ్రా అద్బుతమైన యార్క‌ర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. సుంద‌ర్ ఔటైన‌ప్ప‌టికి, క్రీజులో ఇంకా ఇన్‌ఫామ్ బ్యాట‌ర్ సుద‌ర్శ‌న్ ఉండ‌డంతో ముంబై కోచింగ్ స్టాఫ్ తీవ్ర ఒత్తిడిలో క‌న్పించారు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద‌కు హెడ్‌కోచ్ జ‌యవ‌ర్ధ‌నే, కీర‌న్ పొలార్డ్ వచ్చి ఫీల్డ‌ర్ల‌కు, బౌల‌ర్ల‌కు ప‌దేప‌దే త‌మ సూచ‌న‌ల‌ను పంపారు.

కోచ్ మాట విన‌ని బుమ్రా..
ఈ క్ర‌మంలో జ‌య‌వ‌ర్ద‌నే బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర బుమ్రాకు ఏదో చెబుతుండ‌గా అత‌డు విన్పించుకోలేదు. "ప్ర‌శాంతంగా ఉండండి, నా ప‌ని నాకు తెలుసు. నేను చూసుకుంటా అని బుమ్రా అన్న‌ట్లు హిందీ కామెంటేటర్‌ జతిన్ సప్రు వ్యాఖ్యనించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: ముంబై చేతిలో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న గిల్ సోదరి! వీడియో వైరల్‌
 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)