Breaking News

జ‌స్ప్రీత్ బుమ్రా సూప‌ర్ యార్క‌ర్‌.. దెబ్బ‌కు బ్యాట‌ర్ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Published on Wed, 09/10/2025 - 21:04

టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా మ‌రోసారి త‌న మార్క్ చూపించాడు. ఆసియాక‌ప్‌-2025లో భాగంగా యూఏఈతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అద్బుత‌మైన యార్క‌ర్‌తో మెరిశాడు. అత‌డి వేసిన బంతికి యూఏఈ బ్యాట‌ర్ అలీషన్ షరాఫు వ‌ద్ద స‌మాధాన‌మే లేకుండా పోయింది.

యూఏఈ ఇన్నింగ్స్ 4వ‌ ఓవ‌ర్ వేసిన బుమ్రా.. నాలుగో డెలివ‌రీని అలీష‌న్‌కు సూప‌ర్ యార్క‌ర్‌గా సంధించాడు. అలీషన్ షరాఫు త‌న బ్యాట్‌ను కింద‌కు దించే లోపు బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దెబ్బకు యూఏఈ బ్యాటర్‌ బిత్తర పోయాడు. దీంతో అలీషన్‌(17 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22) ధానాదన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

కాగా వ‌ర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో మ‌ధ్య‌లోనే వ‌చ్చేసిన బుమ్రాకు ఇదే తొలి మ్యాచ్‌. అయితే యూఏఈతో మ్యాచ్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇస్తార‌ని వార్తలు వ‌చ్చాయి. కానీ టీమ్‌మెనెజ్‌మెంట్ బుమ్రాకు మొద‌టి మ్యాచ్‌లో ఆడించి యువ పేస‌ర్ అర్ష్‌దీప్‌ను బెంచ్‌కే ప‌రిమితం చేసింది.  ఈ మ్యాచ్‌లో మూడు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 19 ప‌రుగులిచ్చి ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 13.1 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 57 ప‌రుగుల‌కే ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ప్ర‌త్య‌ర్ధి ప‌తనాన్ని శాసించాడు. అత‌డితో పాటు శివ‌మ్ దూబే మూడు, అక్ష‌ర్ ప‌టేల్‌, బుమ్రా, వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి త‌లా వికెట్ సాధించాడు. యూఏఈ బ్యాట‌ర్ల‌లో అలీషన్ షరాఫు(22) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.


 

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు