వారెవ్వా బుమ్రా.. మిస్సైల్‌లా దూసుకొచ్చిన బంతి! ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది

Published on Thu, 10/02/2025 - 13:48

జస్ప్రీత్ బుమ్రా.. యార్క‌ర్ల‌కు పెట్టింది పేరు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్, ఐపీఎల్ ఏ ప్లాట్‌ఫామ్ అయినా బుమ్రాను మించిన బౌల‌ర్ మ‌రొక‌రు లేరు. అత‌డు సంధించే బంతులు మిస్సైల్‌లా దూసుకొస్తాయి. బుమ్రా బౌలింగ్ చేస్తుంటే స్ట్రైక్‌లో ఉన్న బ్యాట‌ర్ వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే. 

ఇప్పుడు ఆ అనుభ‌వం వెస్టిండీస్ బ్యాట‌ర్ జ‌స్టిన్ గ్రీవ్స్‌కు ఎదురైంది. అహ్మదాబాద్ వేదిక‌గా విండీస్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో బుమ్రా మ్యాజిక్ చేశాడు. విండీస్‌ తొలి ఇన్నింగ్స్ 39వ ఓవ‌ర్‌లో బుమ్రా వేసిన యార్క‌ర్‌కు గ్రీవ్స్ వ‌ద్ద స‌మాధాన‌మే లేకుండా పోయింది.

ఆ ఓవ‌ర్‌లో ఆఖ‌రిని బంతిని బుమ్రా అద్బుత‌మైన యార్క‌ర్‌గా సంధించాడు. ఆఫ్ స్టంప్ దిశ‌గా ప‌డిన బంతిని బ్యాట్‌తో ఆపడంలో గ్రీవ్స్ విఫ‌ల‌మ‌య్యాడు. అత‌డు బ్యాట్ కింద‌కు దించ‌డంలో ఆల‌స్యం కావ‌డంతో 142.7 కి.మీ వేగంతో ప‌డిన బంతిని ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దెబ్బ‌కు క‌రేబియ‌న్ బ్యాట‌ర్ బిత్త‌ర‌పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా మొత్తంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. సిరాజ్‌, బుమ్రాతో పాటు కుల్దీప్‌ రెండు, సుందర్‌ ఓ వికెట్‌ సాధించారు. విండీస్‌ బ్యాటర్లలో గ్రీవ్స్‌ (32) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

 

 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)