Breaking News

హార్దిక్ పై వేటు.. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా!?

Published on Fri, 03/29/2024 - 17:14

ఐపీఎల్‌-2024 సీజ‌న్‌ను ముంబై ఇండియ‌న్స్ పేల‌వంగా ఆరంభించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓట‌మి పాలై తీవ్రంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది.  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో అయితే ముంబై దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఏకంగా 277 ప‌రుగుల రికార్డు స్కోర్ సాధించింది.

ముంబై ఓటముల‌కు ఆ జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఓ కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. రోహిత్ శ‌ర్మ నుంచి ముంబై కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన హార్దిక్ త‌న మార్క్ చూపించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాడు. పాండ్యా కెప్టెన్స్ ప‌రంగానే కాకుండా ఆట‌గాడిగా కూడా తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డిని నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.

చాలా మంది మాజీలు సైతం హార్దిక్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. పాండ్యాను వెంట‌నే ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ముంబై కెప్టెన్సీకి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. హార్దిక్ పాండ్యా ప‌ట్ల ముంబై ఇండియ‌న్స్ ప్రాంఛైజీ కూడా గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో అత‌డిని త‌మ జ‌ట్టు పగ్గాల నుంచి త‌ప్పించే ఆలోచ‌న‌లో ముంబై ఫ్రాంచైజీ ఉన్న‌ట్టు వినికిడి. అత‌డి స్ధానంలో స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు త‌మ జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌జెప్పాల‌ని ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం భావిస్తున్న‌ట్లు వినిస్తున్నాయి. మ‌రి రాబోయే మ్యాచ్‌ల్లో ఏమి జ‌రుగుతుందో వేచి చూడాలి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)