మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
టీ20 ప్రపంచకప్‌కు బుమ్రా దూరం.. బీసీసీఐ ప్రకటన
Published on Mon, 10/03/2022 - 21:22
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏదైతే జరగకూడదని భారత అభిమానులు భావించారో అదే జరిగింది. టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.
ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా సోమవారం ప్రకటించింది. "మెడికల్ టీమ్ సూచన మేరకు బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. బుమ్రా స్థానంలో త్వరలో మరో ఆటగాడిని ఎంపిక చేస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బుమ్రా ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఆసియాకప్-2022కు దూరమైన బుమ్రా తిరిగి ఆస్ట్రేలియాతో సిరీస్‌కు జట్టులోకి వచ్చాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో తొలి టీ20కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రాకు గాయం తిరగబెట్టింది.
దీంతో అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇదే ఈ క్రమంలో ప్రపంచకప్‌కు కూడా దూరం కానున్నడని వార్తలు వినిపించాయి. అయితే తాజా ఇదే విషయంపై గంగూలీ స్పందిస్తూ.. బుమ్రా ప్రపంచకప్‌కు పూర్తిగా దూరం కాలేదు అని పేర్కొన్నాడు.
దీంతో అభిమానులు బుమ్రా తిరిగి మళ్లీ జట్టులోకి వస్తాడని భావించారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఈ మెగా ఈవెంట్‌కు బుమ్రా దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశచెందుతున్నారు.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. కోహ్లికి రెస్ట్! శ్రేయస్‌కు ఛాన్స్
NEWS - Jasprit Bumrah ruled out of ICC Men’s T20 World Cup 2022.
— BCCI (@BCCI) October 3, 2022
More details here - https://t.co/H1Stfs3YuE #TeamIndia
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. కోహ్లికి రెస్ట్! శ్రేయస్‌కు ఛాన్స్
Tags : 1