ఆఖరి టెస్టులో బుమ్రా ఆడుతాడా? కీల‌క అప్‌డేట్ ఇచ్చిన గంభీర్‌

Published on Tue, 07/29/2025 - 09:13

అండర్సన్‌-టెండూల్కర్ ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య ఐదో టెస్టు జూలై 31 నుంచి లండ‌న్ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి లేదా డ్రాగా ముగించైనా సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని ఇంగ్లండ్ భావిస్తుంటే, టీమిండియా మాత్రం ప్ర‌త్య‌ర్ధిని ఓడించి సిరీస్‌ను స‌మం చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను పేస్ బౌలింగ్ క‌ష్టాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ స‌మస్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతుండ‌గా.. ఆకాష్ దీప్ గ‌జ్జ గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అదేవిధంగా చేతి వేలి గాయం కార‌ణంగా లెఫ్ట్మ్ ఆర్మ్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ ఇప్ప‌టికే ఈ సిరీస్ నుంచి త‌ప్పుకొన్నాడు.

అత‌డి స్ధానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన యువ పేస‌ర్ అన్షుల్ కాంబోజ్‌.. త‌న తొలి మ్యాచ్‌లో తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. అంతకుతోడు ఆఖ‌రి రెండు టెస్టులకు దూరంగా ఉన్న పేస‌ర్ ప్ర‌సిద్ద్ కృష్ణ కూడా చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేడు. దీంతో కీలకమైన ఐదో టెస్టులో భారత ఫాస్ట్ బౌలింగ్ కాంబనేషన్ ఎలా ఉంటుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  ఈ నేపథ్యంలో బౌలర్ల ఫిట్‌నెస్‌పై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు.

ఇంగ్లండ్‌తో చివరి టెస్టు కోసం జస్‌ప్రీత్‌ బుమ్రా సహా భారత బౌలింగ్‌ బృందమంతా సిద్ధంగా ఉందని, ఎలాంటి గాయాల సమస్య లేదని గంభీర్‌ స్పష్టం చేశాడు. అయితే బుమ్రా విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, తుది జట్టుకు సంబంధించి ఇంకా చర్చ జరగలేదని అతడు పేర్కొన్నాడు. కాగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టును టీమిండియా పోరాడి డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది.

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు భార‌త తుది జ‌ట్టు(అంచనా)
య‌శస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), కుల్దీప్ యాదవ్, జ‌స్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్‌
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)