Breaking News

'అతడొక అద్భుతం.. కోహునూర్ డైమండ్ కంటే విలువ ఎక్కువ‌'

Published on Wed, 07/03/2024 - 15:33

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024 విజేత‌గా భార‌త్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యంతో భార‌త్ 13 ఏళ్ల వ‌ర‌ల్డ్‌క‌ప్ నిరీక్ష‌ణ‌కు తెరప‌డింది. అయితే భారత్ ఛాంపియ‌న్స్‌గా నిల‌వ‌డంలో స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాది కీల‌క పాత్ర‌. టోర్నీ అసాంతం బుమ్రా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

కీల‌క‌మైన ఫైన‌ల్లో సైతం బుమ్రా స‌త్తాచ‌టాడు. భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌నుకున్న ప్ర‌తీసారి బుమ్రా బంతితో మ్యాజిక్ చేసేవాడు. త‌న బౌలింగ్‌తో వ‌ర‌ల్డ్‌క్లాస్ బ్యాట‌ర్ల‌ను సైతం ముప్పుతిప్ప‌లు పెట్టాడు. 

ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 4.17 ఏకాన‌మీతో 15 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో అత‌డికి  ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది. వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో బుమ్రాని మించిన బౌల‌ర్ మ‌రొక‌డు లేడ‌ని కార్తీక్ కొనియాడాడు.

"బుమ్రా ఒక వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌలర్‌. జ‌స్ప్రీత్‌ కోహినూర్ వజ్రం కంటే విలువైన‌వాడు. కామెంట‌రీలో కూడా ఇదే విష‌యం చాలా సార్లు చెప్పాను. వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల‌లోనూ బుమ్రాని మించిన వాడు మ‌రొక‌డు లేడు. 

ఒత్త‌డిలో అద్బుతంగా బౌలింగ్ చేయ‌డ‌మే బుమ్రా స్పెష‌ల్‌. అత‌డు లాంటి బౌల‌ర్ ఒక‌రు జ‌ట్టులో ఉండాల‌ని ప్ర‌తీ కెప్టెన్ కోరుకుంటాడు. ఎటువంటి పరిస్థితులైనా బుమ్రా రాణించ‌గ‌ల‌డు. ఇది అంద‌రూ బౌల‌ర్లు చేయ‌లేరు. నిజంగా బుమ్రా చాలా బ్రిలియంట్ అంటూ" క్రిక్‌బ‌జ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)