Breaking News

IPL 2025: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌..

Published on Sat, 03/08/2025 - 10:41

ఐపీఎల్‌-2025(IPL-2025) ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు భారీ షాక్ తగలింది. ఆ జట్టు స్టార్ పేసర్‌, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్‌​ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలోనే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. అతడు తన పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ భారత స్పీడ్ స్టార్ ఏప్రిల్‌లో ముంబై ఇండియన్స్‌ శిబిరంలో చేరే అవకాశం ఉంది.

"బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు. అతడి మెడికల్‌​ రిపోర్ట్స్‌​ బాగానే ఉన్నాయి. అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తిరిగి తన బౌలింగ్ ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. అయితే ఐపీఎల్‌లో బౌలింగ్ చేసే ఫిట్‌నెస్ మాత్రం ఇంకా సాధించలేదు. ఏప్రిల్ మొదటి వారంలో బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశముంది. అది కూడా మేము కచ్చితంగా చెప్పలేము. మా వైద్య బృందం అతడిపై క్రమంగా వర్క్‌లోడ్ పెంచుతుంది.

అతడు ఎటువంటి అసౌకర్యం లేకుండా బౌలింగ్ చేయగలిగితేనే వైద్య బృందం క్లియరన్స్ ఇస్తోంది. అప్పటివరకు అతడు సీఓఈలోనే ఉండనున్నాడని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నైసూపర్ కింగ్స్‌తో తలపడనుంది. 

హార్దిక్‌ కూడా..
ఈ మ్యాచ్‌కు ముంబై రెగ్యూలర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం దూరం కానున్నాడు. గతేడాది సీజన్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా పాండ్యాపై ఒక్క మ్యాచ్ నిషేధం పడింది.​  హార్దిక్  గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మూడోసారి స్లో ఓవర్‌ రేట్‌కు కారణమయ్యాడు.

దీంతో వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్‌ను మెయింటేన్ చేయడంతో ఐపీఎల్ నిర్వహకులు అతడిపై ఆడకుండా ఒక్క మ్యాచ్ నిషేదం విధించారు. ఆ బ్యాన్‌ను పాండ్యా ఈ ఏడాది సీజన్‌లో ఎదుర్కొన్నాడు. తొలి మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. కాగా గతేడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో లీగ్‌​ స్టేజికే పరిమితమైన సంగతి తెలిసిందే.
చదవండి: BCCI: శుబ్‌మన్‌ గిల్‌కు ప్రమోషన్‌.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!?

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)