Breaking News

టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా

Published on Mon, 01/27/2025 - 16:35

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ (జనవరి 27) ప్రకటించింది. గతేడాది టెస్ట్‌ల్లో విశేషంగా రాణించినందుకు గానూ బుమ్రాను టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు వరించింది. బుమ్రా గతేడాది టెస్ట్‌ల్లో 14.92 సగటున 71 వికెట్లు తీశాడు. గతేడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ బుమ్రానే.

గతేడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా దరిదాపుల్లో ఎవరూ లేరు. బుమ్రా తర్వాత ఇంగ్లండ్‌ పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ అత్యధిక వికెట్లు సాధించాడు. అట్కిన్సన్‌ గతేడాది 11 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రా, అట్కిన్సన్‌ తర్వాత షోయబ్‌ బషీర్‌ (49), మ్యాట్‌ హెన్రీ (48), రవీంద్ర జడేజా (48) ఉన్నారు.

బుమ్రా టెస్ట్‌ల్లో తన అసమాన ప్రదర్శనతో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ బౌలర్‌గానూ నిలిచాడు. భారత్‌ తరఫున అత్యధిక రేటింగ్‌ పాయింట్లు పొందిన బౌలర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. బుమ్రా గతేడాది సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలపై అనేక సంచలన వికెట్‌ టేకింగ్‌ స్పెల్స్‌ వేశాడు. ఇటీవల ముగిసిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో బుమ్రా పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ సిరీస్‌లో బుమ్రా లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఐసీసీ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2024 అవార్డు కోసం​ బుమ్రాతో పాటు హ్యారీ బ్రూక్‌, జో రూట్‌, కమిందు మెండిస్‌ పోటీపడ్డారు. అంతిమంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు బుమ్రానే వరించింది. 2018లో కోహ్లి తర్వాత ఐసీసీ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెలుచుకున్న మొదటి భారత క్రికెటర్‌ బుమ్రానే.

ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా

మరోవైపు ఇవాళ ​ప్రకటించిన మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధన గెలుచుకుంది. మంధన గతేడాది (2024) ఐసీసీ వుమెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు ఎంపికైంది. మంధన గతేడాది 13 వన్డేల్లో నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్‌రేట్‌తో 747 పరుగులు చేసింది. తద్వారా గతేడాది లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గానూ నిలిచింది. 

గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై తలో సెంచరీ చేసింది. ఐసీసీ వుమెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2024 అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు.

ఇవాళే ప్రకటించిన  ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2024 అవార్డును ఆఫ్ఘనిస్తాన్‌ యువ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ గెలుచుకున్నాడు. ఒమర్‌జాయ్‌ గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. ఒమర్‌జాయ్‌ బ్యాటింగ్‌ సగటు గతేడాది 52.12గా ఉంది. 

ఒమర్‌జాయ్‌ ప్రదర్శనల కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌ గతేడాది ఆడిన ఐదు వన్డే సిరీస్‌ల్లో నాలుగింట జయకేతనం ఎగురవేసింది. మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2024 అవార్డు కోసం ఒమర్‌జాయ్‌తో పాటు కుసాల్‌ మెండిస్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, వనిందు హసరంగ పోటీపడ్డారు.

ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు (2024)..
ఐసీసీ మెన్స్‌ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్-జస్ప్రీత్‌ బుమ్రా
ఐసీసీ వుమెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్-స్మృతి మంధన
ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 
ఐసీసీ ఎమర్జింగ్‌ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-అన్నెరీ డెర్క్‌సెన్‌
ఐసీసీ ఎమర్జింగ్‌ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-కమిందు మెండిస్‌
ఐసీసీ వుమెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-ఈషా ఓఝా
ఐసీసీ మెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-గెర్హార్డ్‌ ఎరాస్మస్‌
ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌
ఐసీసీ మెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-అర్షదీప్‌ సింగ్‌
ఐసీసీ వుమెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-మేలీ కెర్‌

 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)