Breaking News

‘పదేళ్లుగా అదే మాట వింటున్నా’

Published on Tue, 06/24/2025 - 04:49

లీడ్స్‌: భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు పదేళ్లుగా ఉన్నాడు. ఐపీఎల్‌లో పుష్కర కాలం పూర్తి చేసుకున్నాడు. అయితే కెరీర్‌ ఆరంభం నుంచి అతని భిన్నమైన బౌలింగ్‌ శైలిపై ఎన్నో చర్చలు సాగాయి. ఈ తరహా యాక్షన్‌తో ఎక్కువ కాలం కొనసాగలేడని, సుదీర్ఘ కెరీర్‌ సాగడం కష్టమని చాలా మంది అభిప్రాయపడ్డారు. పైగా గాయాలతో ఆటకు దూరం కాగానే ఇంతటితో కెరీర్‌ ముగిసినట్లే అనే విమర్శలు వినిపించాయి. 

కానీ బుమ్రా వాటన్నింటినీ పట్టించుకోలేదు. అద్భుత ప్రదర్శనలతో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించి ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. బరిలోకి దిగిన ప్రతీసారి కొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన తర్వాత అతను ఈ విషయాలపై స్పందించాడు. ‘నేను ఎప్పుడైనా భారత్‌కు ఆడాలని బలంగా కోరుకున్నా. 

నాపై నాకున్న నమ్మకం వల్లే అన్ని ఫార్మాట్‌లలో ఆడగలిగా. కానే వేరేవాళ్లు ఎవరూ దానిని నమ్మలేదు. నువ్వు అసలు ఎప్పుడూ ఆడలేవు అని మొదట్లో అనేవారు. ఆ తర్వాత ఆరు నెలలు, ఆపై ఎనిమిది నెలలు ఆడితే గొప్ప అనేవారు. కానీ ఇప్పుడు భారత్‌ తరఫున దాదాపు పదేళ్లు ఆడితే ఐపీఎల్‌లో మరో మూడేళ్లు అదనంగా ఆడాను. ఇప్పుడు కూడా ఒక గాయం కాగానే నా పనైపోయిందని వెంటనే అనేస్తారు. ప్రతీ మూడు–నాలుగు నెలలకు ఇవే మాటలు వస్తాయి. 

నేను ఇవేమీ పట్టించుకోను. నా పని నేను చేస్తూ పోతా. భారత జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తా. ఆపై దేవుడు నాకు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు. బుమ్రా ఫిట్‌నెస్, పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతను మూడు టెస్టులే ఆడతాడని కోచ్‌ గంభీర్‌ ప్రకటించాడు. అయితే ఇదే విషయంపై బుమ్రా కాస్త భిన్నంగా స్పందించాడు. తాను మూడు టెస్టులే ఆడతానా లేదా అనేదానిపై అతను స్పష్టతనివ్వలేదు. 

‘మున్ముందు ఏం జరగవచ్చనే విషయంపై ఆలోచించడం అనవసరం. ప్రస్తుతం మైదానంలో ఏం జరుగుతోంది అనే దానిపైనే నా దృష్టి ఉంది. నేను పూర్తి చేయాల్సి పని ఉంది. పిచ్‌ ఎలా స్పందిస్తోంది, వికెట్‌ ఎలా తీయాలి, ఏ బ్యాటర్‌కు ఎలా బౌలింగ్‌ చేయాలి అనే అంశాలపైనే నేను ఆలోచిస్తున్నాను. అంతే తప్ప ఎన్ని టెస్టులు ఆడతానని కాదు. ఒక్కసారి మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఈ లెక్కలన్నీ చూసుకోవచ్చు. రాత్రయ్యాక ఈ రోజు నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని భావిస్తే ప్రశాంతంగా పడుకుంటా’ అని బుమ్రా వివరించాడు.    
 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)