Breaking News

బుమ్రా చేజారిన వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకు.. అగ్రస్థానంలో అతడు

Published on Wed, 10/30/2024 - 15:55

టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకును కోల్పోయాడు. అతడి అగ్ర స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ కగిసో రబాడ ఆక్రమించాడు. ఇక బుమ్రా మూడోస్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఈ మేర మార్పులు చోటుచేసుకున్నాయి.

మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్‌లో
కాగా బంగ్లాదేశ్‌ పర్యటనలో రబాడ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మిర్పూర్‌ టెస్టులో తొమ్మిది వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అంతేకాదు.. ఈ టూర్‌ సందర్భంగా రబాడ మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ క్రమంలో రెండు ర్యాంకులు మెరుగుపరచుకున్న 29 ఏళ్ల రబాడ.. బుమ్రాను వెనక్కి నెట్టి వరల్డ్‌ నంబర్‌ వన్‌గా అవతరించాడు.

మరోవైపు.. బుమ్రా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు. దీంతో కివీస్‌తో తొలి రెండు రెండు టెస్టుల్లో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో నంబర్‌ వన్‌ ర్యాంకును కోల్పోయాడు.

సత్తా చాటిన పాక్‌ స్పిన్నర్లు
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌ స్పిన్నర్లు నౌమన్‌ అలీ, సాజిద్‌ ఖాన్‌ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో నౌమన్‌ కెరీర్‌ బెస్ట్‌ సాధించాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి.. తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు.

సాంట్నర్‌ ఏకంగా 30 స్థానాలు ఎగబాకి
మరోవైపు.. సాజిద్‌ ఖాన్‌ సైతం 12 స్థానాలు మెరుగుపరచుకుని కెరీర్‌లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించాడు. ఇక టీమిండియాతో పుణె వేదికగా రెండో టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ సైతం ముందుకు దూసుకువచ్చాడు. రెండో టెస్టులో 13 వికెట్లతో చెలరేగిన ఈ లెఫ్టార్మ్‌ బౌలర్‌ 30 స్థానాలు ఎగబాకి 44వ ర్యాంకుకు చేరుకున్నాడు.

ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకులు టాప్‌-5
1. కగిసో రబాడ(సౌతాఫ్రికా)- 860 రేటింగ్‌ పాయింట్లు
2. జోష్‌ హాజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా)- 847 రేటింగ్‌ పాయింట్లు
3. జస్‌ప్రీత్‌ బుమ్రా(ఇండియా)- 846 రేటింగ్‌ పాయింట్లు
4. రవిచంద్రన్‌ అశ్విన్‌(ఇండియా)- 831 రేటింగ్‌ పాయింట్లు
4. ప్యాట్‌ కమిన్స్‌(ఆస్ట్రేలియా)- 820 రేటింగ్‌ పాయింట్లు.

జైస్వాల్‌కు మూడో ర్యాంకు
ఇదిలా ఉంటే.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో జో రూట్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్‌ విలియమ్సన్‌ రెండో ర్యాంకు నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఒక ర్యాంకు మెరుగపరుచుకుని మూడో స్థానానికి చేరుకోగా.. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌, ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్‌ స్మిత్‌ ఆ తర్వాతి ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)