Breaking News

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. హెడ్‌కోచ్‌ లేకుండానే! టీమిండియా ఎలా మరి?

Published on Sat, 08/12/2023 - 08:11

జస్ప్రీత్‌ బుమ్రా సారధ్యంలోని యువ భారత జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్‌లో భాగంగా అతిథ్య ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌ కోసం భారత జట్టు రెండు బ్యాచ్‌లగా ఐర్లాండ్‌కు చేరుకోనుంది. మంగళవారం(ఆగస్టు 15)న జస్ప్రీత్‌ బుమ్రా, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌తో కూడిన బృందం మొదటి బ్యాచ్‌గా ఐర్లాండ్‌కు పయనం కానుంది.

మరోవైపు విండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఉన్న తిలక్‌ వర్మ, జైశ్వాల్‌, సంజూ శాంసన్‌ నేరుగా యూఎస్‌ నుంచి ఐర్లాండ్‌కు బయలదేరునున్నారు. ఆగస్టు 18న  డబ్లిన్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

హెడ్‌కోచ్‌ లేకుండానే..
ఇక ఐర్లాండ్‌ పర్యటనకు హెడ్‌కోచ్‌ లేకుండా భారత జట్టు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌ టూర్‌ తర్వాత  రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఇతర కోచింగ్‌ స్టాప్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఐర్లాండ్‌ టూర్‌కు  టీమిండియా హెడ్‌కోచ్‌గా ఏన్సీఏ ఛీప్‌ వీవీయస్‌ లక్ష్మణ్‌ వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపించాయి.

గతంలో చాలాసార్లు ద్రవిడ్‌ గైర్హజరీలో ఈ హైదరాబాదీనే భారత జట్టు కోచ్‌గా పనిచేశాడు. కానీ  ఈ సారి మాత్రం ఐరీష్‌ టూర్‌కు లక్ష్మణ్‌ కూడా వెళ్లడం లేదు. క్రిక్‌బజ్‌ రిపోర్టు ప్రకారం.. ఇండియా-ఏ జట్టు ​కోచ్‌లు సితాన్షు కోటక్ , సాయిరాజ్ బహుతులే నేతృత్వంలో భారత్‌ ఈ సిరీస్‌ ఆడనుంది.

ఐర్లాండ్‌ సిరీస్‌కు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ , యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, జితేష్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ , ముఖేష్ కుమార్‌, అవేష్‌ ఖాన్‌
చదవండి
: The Hundred 2023: సన్‌రైజర్స్‌ ఆటగాడు ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే!

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)