న‌రాలు తెగే ఉత్కంఠ‌.. ఆఖ‌రి బంతికి పాకిస్తాన్ ఓట‌మి

Published on Sun, 08/03/2025 - 10:55

ఫ్లోరిడా వేదికగా పాకిస్తాన్‌తో ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. విండీస్ ఆల్‌రౌండ‌ర్ జాస‌న్ హోల్డ‌ర్ ఆఖ‌రి బంతికి ఫోర్ కొట్టి త‌న జ‌ట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 133 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. 

పాక్ బ్యాట‌ర్ల‌లో హ‌స‌న్ నవాజ్‌(40) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. స‌ల్మాన్ అఘా(38) ప‌రుగుల‌తో రాణించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. విండీస్ బౌల‌ర్ల‌లో జాసెన్ హోల్డ‌ర్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మోటీ రెండు, అకిల్ హోస్సేన్‌, చేజ్‌, జోష‌ఫ్ త‌లా వికెట్ సాధించారు.

అనంత‌రం స్వ‌ల్ప‌ ల‌క్ష్య చేధ‌న‌లో వెస్టిండీస్ త‌డ‌బ‌డింది. వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయి ఓట‌మి దిశ‌గా ప‌య‌నించింది.  అయితే జాసన్ హోల్డ‌ర్‌(16),షెఫ‌ర్డ్‌(15) కాస్త దూకుడుగా ఆడ‌డ‌డంతో విండీస్ తిరిగి గేమ్‌లోకి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో ఆఖ‌రి ఓవ‌ర్‌లో క‌రేబియ‌న్ జ‌ట్టు విజ‌యానికి 8 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. షాహీన్ అఫ్రిది వేసిన తొలి బంతికి హోల్డ‌ర్ సింగిల్ తీయ‌గా.. రెండో బంతికి షెఫ‌ర్డ్ ఔట‌య్యాడు. త‌ర్వాతి మూడు బంతుల్లో మూడు ప‌రుగులు వ‌చ్చాయి.

దీంతో ఆఖ‌రి బంతికి విండీస్ గెలుపున‌కు 4 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఆ బంతిని అఫ్రిది వైడ్‌గా సంధించ‌డంతో విండీస్ విజ‌యస‌మీక‌ర‌ణంగా మూడు ప‌రుగులగా మారింది. ఈ క్ర‌మంలో హోల్డ‌ర్ ఆఖ‌రి బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు.

దీంతో సంచలన విజ‌యాన్ని హోప్ సేన త‌న ఖాతాలో వేసుకుంది. ఈ  విజ‌యంతో సిరీస్‌ను 1-1తో ఆతిథ్య విండీస్ స‌మం చేసింది. పాక్ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ న‌వాజ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సైమ్ అయూబ్ రెండు వికెట్లు సాధించాడు. ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 ఆగ‌స్టు 4న జ‌ర‌గ‌నుంది.
చదవండి: WCL: డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాక్‌ చిత్తు! టైటిల్‌ సౌతాఫ్రికాదే
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)