‘శుభమ్‌’ ఆరంభం

Published on Wed, 02/25/2026 - 02:43

హుబ్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న జమ్మూకశ్మీర్‌ జట్టు... తుదిపోరులోనూ అదే జోరు కనబరుస్తోంది. ఎనిమిది సార్లు రంజీ ట్రోఫీ టైటిల్‌ గెలిచిన కర్ణాటకపై ఏమాత్రం అదురు బెదురు లేకుండా సాధికారికంగా ఆడుతోంది. మంగళవారం ప్రారంభమైన రంజీ ఫైనల్లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న జమ్మూకశ్మీర్‌ జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. 

శుభమ్‌ పుండిర్‌ (221 బంతుల్లో 117 బ్యాటింగ్‌; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో విజృంభించగా... యావర్‌ హసన్‌ (150 బంతుల్లో 88; 13 ఫోర్లు), అబ్దుల్‌ సమద్‌ (67 బంతుల్లో 52 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో మెరిశారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబరుస్తున్న జమ్మూకశ్మీర్‌ జట్టు... స్టార్‌లతో నిండి ఉన్న కర్ణాటకపై అదే దూకుడు కనబర్చింది. ఓపెనర్‌ కమ్రాన్‌ ఇక్బాల్‌ (6) విఫలం కాగా... మరో ఓపెనర్‌ యావర్‌ హసన్‌తో కలిసి శుభమ్‌ రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. 

ఈ క్రమంలో యావర్‌ 77 బంతుల్లో శుభమ్‌ 100 బంతుల్లో హాఫ్‌సెంచరీలు పూర్తి చేసుకున్నారు. శుభమ్‌ ఆరంభం నుంచి ఆచితూచి ఆడితే... యావర్‌ మాత్రం ఎడాపెడా బౌండరీలు బాదాడు. కర్ణాటక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ ద్వయం 244 బంతుల్లో 139 పరుగులు జోడించింది. ప్రసిధ్‌ బౌన్సర్‌కు గాయపడిన కెపె్టన్‌ పారస్‌ డోగ్రా (9) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగ్గా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అబ్దుల్‌ సమద్‌... శుభమ్‌కు చక్కటి సహకారం అందించాడు. 

వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్‌కు 144 బంతుల్లో 105 పరుగులు జోడించారు. ఈ క్రమంలో శుభమ్‌ భారీ సిక్స్‌ సాయంతో 186 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో మధ్యప్రదేశ్, సెమీఫైనల్లో బెంగాల్‌పై విజయాలు సాధించిన జమ్మూకశీ్మర్‌ జట్టు... కర్ణాటకపై సైతం చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చింది. 

కర్ణాటక జట్టు తరఫున ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో జమ్మూకశ్మీర్‌ ప్లేయర్లు పరుగుల వరద పారించడం విశేషం. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న జమ్మూకశీ్మర్‌ జట్టు రెండో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందనేది కీలకం.  

స్కోరు వివరాలు 
జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌: కమ్రాన్‌ ఇక్బాల్‌ (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 6; యావర్‌ హసన్‌ (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 88; శుభమ్‌ (బ్యాటింగ్‌) 117; పారస్‌ డోగ్రా (రిటైర్డ్‌ హర్ట్‌) 9; అబ్దుల్‌ సమద్‌ (బ్యాటింగ్‌) 52; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (87 ఓవర్లలో 2 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–18, 2–157, 2–179. బౌలింగ్‌: విద్యాధర్‌ పాటిల్‌ 16–0–66–0; విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ 18–6–25–0; ప్రసిధ్‌ కృష్ణ 16–5–36–2; శ్రేయస్‌ గోపాల్‌ 17–1–79–0; శిఖర్‌ షెట్టి 20–0–68–0.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)