Breaking News

తగ్గేదేలే!

Published on Thu, 02/26/2026 - 00:55

హుబ్లీ: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌ ఆడుతున్న జమ్మూకశ్మీర్‌ జట్టు  అద్వితీయ ఆటతీరు కనబరుస్తోంది. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్న కర్ణాటకతో తుదిపోరులో జమ్మూ ప్లేయర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఓవర్‌నైట్‌ స్కోరు 284/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన జమ్మూకశ్మీర్‌ జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 156 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 527 పరుగులు చేసింది. కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (166 బంతుల్లో 70; 8 ఫోర్లు), కన్హయ్య వాధ్వాన్‌ (109 బంతుల్లో 70; 9 ఫోర్లు), సాహిల్‌ లోత్రా (93 బంతుల్లో 57 బ్యాటింగ్‌; 7 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. 

ప్లేయర్లంతా బాధ్యతాయుతంగా ఆడటంతో జమ్మూ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు శుభమ్‌ పుండిర్‌ (247 బంతుల్లో 121; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్‌ సమద్‌ (104 బంతుల్లో 61; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోయారు. బుధవారం ఆట ప్రారంభమైన కాసేపటికే శుభమ్‌ అవుట్‌ కాగా... తదుపరి ఓవర్‌లో అబ్దుల్‌ సమద్‌ సైతం పెవిలియన్‌ చేరాడు. ఈ దశలో తొలి రోజు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన కెప్టెన్‌ పారస్‌ డోగ్రా క్రీజులోకి వచ్చాడు. సుదీర్ఘ అనుభవమున్న ఈ 41 ఏళ్ల బ్యాటర్‌... ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయాడు. 

మరోవైపు నుంచి కన్హయ్య అతడికి చక్కటి సహకారం అందించాడు. ఈ జంట చాపకింద నీరులా పరుగులు రాబడుతుండటంతో... కర్ణాటక ప్లేయర్లలో అసహనం పెరిగిపోయింది. ఇది మైదానంలో స్పష్టంగా కనిపించింది. పలుమార్లు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు సైతం జరిగాయి. ఈ క్రమంలో కన్హయ్య 84 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... పారస్‌ డోగ్రా 140 బంతుల్లో హాఫ్‌సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. ఐదో వికెట్‌కు 192 బంతుల్లో 110 పరుగులు జోడించిన అనంతరం కన్హయ్య వెనుదిరిగాడు. 

ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన జమ్మూకశ్మీర్‌... కర్ణాటక బౌలర్లను మరింత అసహనానికి గురిచేసింది. ఆరో వికెట్‌కు పారస్, సాహిల్‌ కలిసి 75 బంతుల్లో 54 పరుగులు జోడించగా... అబేధ్యమైన ఏడో వికెట్‌కు అబిద్‌ ముస్తాక్‌ (20 బ్యాటింగ్‌; 2 ఫోర్లు)తో కలిసి సాహిల్‌ 56 పరుగులు జత చేశాడు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా... విద్యాధర్‌ పాటిల్, శ్రేయస్‌ గోపాల్, శిఖర్‌ షెట్టి తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఇప్పటికే మంచి స్కోరు సాధించిన జమ్మూకశ్మీర్‌ జట్టు... తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతోనే పైచేయి సాధించాలనే ఉద్దేశంతో సాగుతోంది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న ఆ జట్టు మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి. 

స్కోరు వివరాలు 
జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌: కమ్రాన్‌ ఇక్బాల్‌ (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 6; యావర్‌ హసన్‌ (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 88; శుభమ్‌ (సి) (సబ్‌) అనీశ్‌ (బి) విద్యాధర్‌ 121; పారస్‌ డోగ్రా (బి) శ్రేయస్‌ 70; అబ్దుల్‌ సమద్‌ (సి) కృతిక్‌ (బి) ప్రసిధ్‌ 61; కన్హయ్య (సి) రాహుల్‌ (బి) శిఖర్‌ 70; సాహిల్‌ (బ్యాటింగ్‌) 57; ఆబిద్‌ ముస్తాక్‌ (బ్యాటింగ్‌) 20; ఎక్స్‌ట్రాలు 34; మొత్తం (156 ఓవర్లలో 6 వికెట్లకు) 527. వికెట్ల పతనం: 1–18, 2–157, 3–303, 4–307, 5–417, 6–471. బౌలింగ్‌: విద్యాధర్‌ పాటిల్‌ 29–2–104–1; విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ 31–10–60–0; ప్రసిధ్‌ కృష్ణ 29–7–90–3; శ్రేయస్‌ గోపాల్‌ 33–2–130–1; శిఖర్‌ షెట్టి32–1–112–1; కరుణ్‌ నాయర్‌ 2–1–1–0.

అదేం పెద్ద విషయం కాదు 
ఫైనల్లో మా ప్లేయర్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. జట్టు సమష్టిగా సత్తా చాటుతోంది. ప్రస్తుతానికి మా జట్టు మంచి స్థితిలో ఉంది. ఇలాంటి పెద్ద మ్యాచ్‌ల్లో ఆమాత్రం కోపోద్రేకాలు సహజం. అనీశ్‌తో వాగ్వాదం అప్పటివరకు మాత్రమే. ఆ తర్వాత అంతా సాధారణమే. మేం తర్వాత మాట్లాడుకున్నాం కూడా. 

కర్ణాటక జట్టులో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. వారి ముందు లక్ష్యాన్ని నిర్దేశించాలనే ఉద్దేశం లేదు. తొలి ఇన్నింగ్స్‌ను వీలైనంత వరకు కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు మా ప్లేయుర్లు చక్కటి ఆటతీరు కనబర్చారు. ఇక ముందు కూడా అదే స్ఫూర్తితో సాగుతాం.  –పారస్‌ డోగ్రా, జమ్మూకశ్మీర్‌ కెప్టెన్‌  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)