Breaking News

వారెవ్వా.. 41 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్‌! వీడియో వైరల్‌

Published on Mon, 02/26/2024 - 11:25

రాంఛీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రసవత్తరంగా మారింది. 40/0 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైశ్వాల్‌(37) తొలి వికెట్‌గా రూట్‌ బౌలింగ్‌లో ఔట్‌ కాగా.. అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(55), రజిత్‌ పాటిదార్‌(0) పెవిలియన్‌కు చేరారు. భారత విజయానికి ఇంకా 80 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో గల్‌(13), జడేజా(2) పరుగులతో ఉన్నారు.

ఆండర్సన్‌ కళ్లు చెదిరే క్యాచ్‌..
ఇక నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ వెటరన్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. యశస్వీ జైశ్వాల్‌ను స్టన్నింగ్‌ క్యాచ్‌తో ఆండర్సన్‌ పెవిలియన్‌కు పంపాడు. భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 17 ఓవర్‌ వేసిన జో రూట్‌ బౌలింగ్‌లో మూడో బంతిని జైశ్వాల్‌ ఆఫ్‌ సైడ్‌ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతిలో టర్న్‌ ఎక్కువగా వుండడంతో ఎడ్జ్‌ తీసుకుని బ్యాక్‌వర్డ్ పాయింట్‌ దిశగా వెళ్లింది.

ఈ క్రమంలో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న 41 ఏళ్ల ఆండర్సన్‌ ఫుల్‌ లెంగ్త్‌ డైవ్‌ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)