Breaking News

CPL 2022: సెంచరీతో విండీస్‌ హిట్టర్‌ విధ్వంసం.. ఫైనల్లో జమైకా తలైవాస్‌

Published on Thu, 09/29/2022 - 17:33

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌ 2022)లో జమైకా తలైవాస్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి గయానా అమెజాన్‌ వారియర్స్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో జమైకా తలైవాస్‌ 37 పరుగులతో విజయాన్ని అందుకుంది. విండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ షమ్రా బ్రూక్స్‌ కీలక సమయంలో సెంచరీతో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన జమైకా తలైవాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీస్కోరు చేసింది. షమ్రా బ్రూక్స్‌(52 బంతుల్లో 109 నాటౌట్‌, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. రోవ్‌మెన్‌ పావెల్‌ 23 బంతుల్లో 37 పరుగులు చేయగా.. చివర్లో ఇమాద్‌ వసీమ్‌ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. గయానా వారియర్స్‌ బౌలర్లలో రొమెరియో షెపర్డ్‌  రెండు వికెట్లు తీయగా.. తాహిర్‌, ఓడియన్‌ స్మిత్‌లు చెరొక వికెట్‌ తీశారు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన గయానా అమెజాన్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసింది. కీమో పాల్‌ 56 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. షెయ్‌ హోప్‌ 31 పరుగులు, ఓడెన్‌ స్మిత్‌ 24 పరుగులు చేశారు. జమైకా తలైవాస్‌ బౌలర్లలో ఇమాద్‌ వసీమ్‌, క్రిస్‌ గ్రీన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. మహ్మద్‌ ఆమిర్‌, ఫాబియెన్‌ అలెన్‌, రోవ్‌మెన్‌ పావెలు తలా ఒక వికెట్‌ తీశారు.


 

Videos

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)