Breaking News

రంజీల్లో కేరళ బౌలర్‌ ఆల్‌టైమ్‌ రికార్డు.. అత్యంత అరుదైన ఘనత

Published on Fri, 01/31/2025 - 16:09

కేరళ స్పిన్నర్‌ జలజ్‌ సక్సేనా(Jalaj Saxena) సంచలన రికార్డు సాధించాడు. రంజీ చరిత్ర(Ranji Trophy)లో ఇంత వరకు ఏ బౌలర్‌కూ సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించాడు. అత్యధికంగా పందొమ్మిది వేర్వేరు జట్లపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన క్రికెటర్‌గా ఆల్‌టైమ్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

కాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన జలజ్‌ సక్సేనా.. దేశవాళీ క్రికెట్లో కేరళ(Keral) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 23న రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో రెండో దశ పోటీలు ఆరంభం కాగా... కేరళ తరఫున మరోసారి బరిలోకి దిగాడు. సెకండ్‌ లెగ్‌లో కేరళ తొలుత మధ్యప్రదేశ్‌తో తలపడగా.. జలజ్‌ ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు వికెట్లు మాత్రమే తీశాడు.

సల్మాన్‌ నిజార్‌ భారీ శతకం
ఇక ఈ మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగియగా.. తాజాగా కేరళ బిహార్‌తో తలపడుతోంది. ఎలైట్‌ గ్రూప్‌- ‘సి’లో భాగంగా తిరువనంతపురంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేరళ తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 351 పరుగులకు ఆలౌట్‌ అయింది. సల్మాన్‌ నిజార్‌ భారీ శతకం(150) బాదడంతో కేరళ ఈ మేరకు స్కోరు చేయగలిగింది.

జలజ్‌కు ఐదు వికెట్లు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బిహార్‌ జట్టుకు జలజ్‌ సక్సేనా చుక్కలు చూపించాడు. 7.1 ఓవర్ల బౌలింగ్‌లో 19 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. ఓపెనర్‌ షర్మాన్‌ నిగ్రోథ్‌(6)తో పాటు.. సకీబుల్‌ గనీ(0), బిపిన్‌ సౌరభ్‌(4), కెప్టెన్‌ వీర్‌ ప్రతాప్‌ సింగ్‌(0), హర్ష్‌ సింగ్‌(5) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

జలజ్‌ సక్సేనాకు తోడుగా ఎండీ నిధీశ్‌ , వైశాఖ్‌ చంద్రన్‌, ఆదిత్య సర్వాటే రాణించారు. నిధీశ్‌ రెండు, వైశాఖ్‌, ఆదిత్య ఒక్కో వికెట్‌ తీశారు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో 64 పరుగులకే బిహార్‌ కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కేరళకు ఏకంగా 287 పరుగుల ఆధిక్యం లభించింది.

కాగా జలజ్‌ సక్సేనా రంజీల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ప్రత్యర్థి జట్లలో బిహార్‌ పందొమ్మిదవది కావడం విశేషం. ఇంతకుముందు పంకజ్‌ సింగ్‌ రంజీల్లో పద్దెనిమిది జట్లపై ఐదు వికెట్ల హాల్‌ సాధించగా.. తాజాగా జలజ్‌ అతడిని అధిగమించాడు.

400కు పైగా వికెట్లు
రంజీ ట్రోఫీలో జలజ్‌ సక్సేనాకు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు అతడు 416కు పైగా వికెట్లు తీశాడు. తద్వారా టోర్నీ చరిత్రలో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌-10లో నిలిచాడు. ఇక ఇటీవలే అతడు రంజీల్లో ఆరు వేల పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు.

ఈ క్రమంలో రంజీల్లో ఈ మేర పరుగులు రాబట్టడంతో పాటు నాలుగు వందలకు పైగా వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. ఇక 2005లో స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌ తరఫున తొలిసారి రంజీ బరిలో దిగిన జలజ్‌.. 2016-17 సీజన్‌ నుంచి కేరళ జట్టుకు ఆడుతున్నాడు.

రంజీల్లో అత్యధిక జట్లపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆటగాళ్లు వీరే
👉జలజ్‌ సక్సేనా- 19
👉పంకజ్‌ సింగ్‌- 18
👉సునిల్‌ జోషి- 16
👉ఆర్‌. వినయ్‌ కుమార్‌- 16
👉షాబాజ్‌ నదీం- 16
👉ఆదిత్య సర్వాటే-16. 

చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్‌.. రంజీల్లో ఆల్‌టైమ్‌ రికార్డు

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)