Breaking News

జైపూర్‌ పింక్‌ పాంథర్స్ 'సిక్స‌ర్‌'

Published on Thu, 10/02/2025 - 12:27

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఆరో విజయం నమోదు చేసుకుంది. హరియాణా స్టీలర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ 37–36 పాయింట్ల తేడాతో గెలిచింది. జైపూర్‌ తరఫున సాహిల్‌ 7, అలీ 6 పాయింట్లు సాధించారు.

స్టీలర్స్‌ తరఫున వినయ్‌ 11 పాయింట్లతో పోరాడినా సరిపోలేదు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో స్టీలర్స్‌ 21 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... జైపూర్‌ 16 రెయిడ్‌ పాయింట్లకే పరిమితమైంది. అయితే ఆలౌట్‌ పాయింట్లు, ఎక్స్‌ట్రా పాయింట్లలో ముందంజ వేసిన పింక్‌ పాంథర్స్‌ విజయం సాధించింది. 

తాజా సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 6 విజయాలు, 4 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. హర్యానా స్టీలర్స్‌ 10 మ్యాచ్‌లో 6 గెలిచి నాలుగింట ఓడి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 

మరో మ్యాచ్‌లో యు ముంబా 42–24 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది. యు ముంబా తరఫున సందీప్‌ కుమార్‌ 12 పాయింట్లతో విజృంభించగా... తలైవాస్‌ తరఫున అత్యధికంగా రోహిత్‌ గోపాల్‌ 7 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్‌... గుజరాత్‌ జెయింట్స్‌తో యు ముంబా తలపడతాయి.
చదవండి: AB de Villiers: ఆసియాకప్‌ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్‌ విమర్శలు

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు