Breaking News

విండీస్‌ టూర్‌లో ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడే యువకులకు చోటివ్వాలి: జాఫర్‌

Published on Sat, 06/17/2023 - 21:13

ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. అనంతరం వచ్చె నెలలో వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ జూన్‌ 27న ప్రకటించనుంది.

ఈ పర్యటనలో భారత జట్టు నుంచి కొంత మంది కొత్తముఖాలను చూసే ఛాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ సెలక్టర్లకు కీలక సూచనలు చేశాడు. విండీస్‌ పర్యటనలో ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడే యువకులకు జట్టులో చోటివ్వాలని జాఫర్‌ అభిప్రాయపడడ్డాడు.

"టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడాలి. ముఖ్యంగా వైట్‌బాల్‌ క్రికెట్‌లో మరింత దూకుడుగా ఆడాలి. ధైర్యంగా ఆడే యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే మనం విజయాలు సాధిస్తాం. అదే విధంగా టీ20 క్రికెట్‌ జట్టులో యశస్వి జైస్వాల్ వంటి విధ్వంసకర ఆటగాడికి కచ్చితంగా ఛాన్స్‌ ఇవ్వాలి.

భారత్‌కు రింకూ సింగ్‌ రూపంలో కూడా మరో ఆప్షన్‌ ఉంది. అతడు కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం జట్టులో లేడు కాబట్టి అతడి స్ధానంలో జితేష్ శర్మకు అవకాశం ఇవ్వాలి. అతడు ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్‌ చేయగలడు. నా వరకు అయితే విండీస్‌తో వన్డే సిరీస్‌కు సంజు శాంసన్‌కు చోటు దక్కే ఛాన్స్‌ ఉంది" అని స్పోర్ట్స్‌ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్‌ పేర్కొన్నాడు.
చదవండి: అహ్మదాబాద్‌లో ఆడటానికి ఎందుకంత భయం.. దెయ్యం ఏమైనా ఉందా: పీసీబీపై అఫ్రిది ఫైర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)