Breaking News

న్యూజిలాండ్‌ బౌలింగ్‌ కోచ్‌గా మాజీ ఆల్‌రౌండర్‌

Published on Thu, 08/29/2024 - 08:02

న్యూజిలాండ్‌ పురుషుల క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్‌ జేకబ్‌ ఓరమ్‌ ఎంపికయ్యాడు. ఓరమ్‌ అక్టోబర్‌ 7 నుంచి బాధ్యతలు చేపడతాడు. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ కోచ్‌ పదవి 2023 నవంబర్‌ నుంచి ఖాళీగా ఉంది. అప్పట్లో షేన్‌ జర్గెన్సన్‌ న్యూజిలాండ్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఓరమ్‌ 2018-2022 మధ్య న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు. గత కొంతకాలంగా అతను న్యూజిలాండ్‌ మెన్స్‌ టీమ్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు.

46 ఏళ్ల ఓరమ్‌ 2014లో కోచింగ్‌ కెరీర్‌ను మొదలుపెట్టాడు. అప్పట్లో అతను న్యూజిలాండ్‌-ఏ టీమ్‌ బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు. ఓరమ్‌ ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. అతను సూపర్‌ స్మాష్‌లో సెంట్రల్‌ హిండ్స్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అలాగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఓరమ్‌ న్యూజిలాండ్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక కావడాన్ని ఆ జట్టు హెడ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ స్వాగతించాడు.

ఆటగాడిగా, కోచ్‌గా ఓరమ్‌ అనుభవం న్యూజిలాండ్‌ జట్టుకు చాలా ఉపయోగపడుతుందని అన్నాడు. ఓరమ్‌ నూతన బాధ్యతలను భారత్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌ నుంచి చేపడతాడు. అక్టోబర్‌ 16 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఓరమ్‌ 2001-2012 మధ్యలో న్యూజిలాండ్‌ తరఫున 33 టెస్ట్‌లు, 160 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. ఓరమ్‌ ఐపీఎల్‌లోనూ వివిధ ఫ్రాంచైజీల తరఫున 18 మ్యాచ్‌లు ఆడాడు.

ఓరమ్‌ టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 6 అర్ద సెంచరీలు.. వన్డేల్లో సెంచరీ, 13 అర్ద సెంచరీలు, టీ20ల్లో 2 హాఫ్‌ సెంచరీలు చేశాడు. బౌలింగ్‌లో టెస్ట్‌ల్లో 60 వికెట్లు, వన్డేల్లో 173 వికెట్లు, టీ20ల్లో 19 వికెట్లు తీశాడు. 
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)