Breaking News

ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ పట్టాడు.. మరుసటి రోజే..!

Published on Tue, 11/26/2024 - 11:31

ఇంగ్లండ్‌ యువ ఆటగాడు జేకబ్‌ బేతెల్‌ ఈ మధ్యకాలంలో వరుసగా లక్కీ ఛాన్స్‌లు కొట్టేస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో టీ20, వన్డే అరంగేట్రం చేసిన బేతెల్‌.. నిన్ననే  (నవంబర్‌ 25) ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ పట్టాడు. ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో బేతెల్‌ను ఆర్సీబీ 2.6 కోట్లకు సొంతం చేసుకున్నాడు. తాజాగా బేతెల్‌ మరో లక్కీ ఛాన్స్‌ కొట్టాడు. బేతెల్‌కు ఇంగ్లండ్‌ తరఫున టెస్ట్‌ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. 

ఈ నెల 28 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో బేతెల్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేస్తాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు చెప్పింది. వరుస అవకాశాల నేపథ్యంలో బేతెల్‌ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. 21 ఏళ్ల లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన బేతెల్‌కు దేశవాలీ క్రికెట్‌లో పెద్దగా ట్రాక్‌ రికార్డు లేనప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి. 

బేతెల్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో వార్విక్‌షైర్‌ తరఫున 20 మ్యాచ్‌లు ఆడి 25.44 సగటున 738 పరుగులు చేశాడు. 7 వికెట్లు తీశాడు. ఇటీవల జరిగిన హండ్రెడ్‌ లీగ్‌లో బేతెల్‌ బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ తరఫున 7 మ్యాచ్‌లు ఆడి 165 పరుగులు చేశాడు. బేతెల్‌ ఇంగ్లండ్‌ తరఫున 8 వన్డేలు ఆడి హాఫ్‌ సెంచరీ సాయంతో 167 పరుగులు చేశాడు. 7 టీ20ల్లో 2 హాఫ్‌ సెంచరీ సాయంతో 173 పరుగులు చేశాడు. వన్డేల్లో బేతెల్‌ నాలుగు వికెట్లు తీశాడు.

ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన
ఈ నెల 28 నుంచి క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ఇవాళ (నవంబర్‌ 26) ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో బేతెల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనుండగా.. రెగ్యులర్‌గా ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేసే ఓలీ పోప్‌ ఆరో స్థానానికి డిమోట్‌ అయ్యాడు. వికెట్‌కీపర్‌ జోర్డన్‌ కాక్స్‌ గాయపడటంతో పోప్‌ వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. 

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌ రానుండగా.. బేతెల్‌ మూడో స్థానంలో, జో రూట్‌ నాలుగులో, హ్యారీ బ్రూక్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నారు. అనంతరం ఆరో స్థానంలో ఓలీ పోప్‌, ఆతర్వాత కెప్టెన్‌ బెన్ స్టోక్స్‌ బరిలోకి దిగనున్నారు.ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ ముగ్గురు పేసర్లను, స్పిన్నర్‌ను బరిలోకి దించనుంది. పేసర్లుగా క్రిస్‌ వోక్స్‌, గస్ట్‌ అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌ బరిలోకి దిగనుండగా.. ఏకైక స్పిన్నర్‌గా షోయబ్‌ బషీర్‌ ఎంపికయ్యాడు.

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఓలీ పోప్ (WK), బెన్ స్టోక్స్ (C), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్‌, షోయబ్ బషీర్

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)