Breaking News

ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ కన్నుమూత

Published on Fri, 07/31/2026 - 18:08

ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ ఫ్రాంకో బరెసి (66) కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో బెస్ట్ డిఫెండర్స్‌లో ఒకడిగా పేరు పొందిన ఫ్రాంకో బరెసి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1982లో ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఇటలీ జట్టులో ఫ్రాంకో సభ్యుడిగా ఉన్నాడు. 22 ఏళ్ల వయసులోనే ఇటలీ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై ఫ్రాంకో బరెసి చరిత్ర సృష్టించాడు.

ఇటలీలోని ట్రావగ్లియాటో అనే చిన్న పట్టణంలో 1960 మే 8న జన్మించిన బరేసి, చిన్నతనంలోనే తల్లిందడ్రులను కోల్పోయారు. అనాథగా ఎన్నో కష్టాలను దాటుకొని అత్యుత్తమ ఫుట్​బాల‌ర్‌గా ఎదిగిన తీరు అంద‌రికి ఆద‌ర్శం. ఇక ఫ్రాంకో ఏడుసార్లు బాల‌న్ డి'ఓర్‌కు నామినేట్ అయ్యి, 1989లో రెండో స్థానంలో నిలిచారు. 2013లో ఇటాలియన్ ఫుట్‌బాల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.

మూడు ఫిఫా ప్రపంచకప్‌లు
ఫ్రాంకో బరేసీ తన మొత్తం ప్రొఫెషనల్ కెరీర్‌లో ఏసీ మిలాన్, ఇటలీ రెండు జట్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ఇటలీ తరపున 81 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 1982, 1990, 1994 మూడు ఫిఫా ప్రపంచ కప్‌లలో ఇటలీకి ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా 1994 ప్రపంచ కప్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఫైనల్‌కు చేర్చాడు. అయితే ఫైనల్​లో ఇటలీ పోరాడి ఓడిపోయింది. ఫైన‌ల్లో బ్రెజిల్ పెనాల్టీ షూటౌట్‌లో 3-2తో ఇట‌లీపై నెగ్గి టైటిల్‌ను ముద్దాడింది.

ఒకే ఫుట్‌బాల్ క్ల‌బ్‌కు ప్రాతినిధ్యం
ఫ్రాంకో బరేసి త‌న జీవితంలో ఇట‌లీ జాతీయ జ‌ట్టుతో పాటు ఒకే ఫుట్‌బాల్ క్ల‌బ్‌కు ఆడ‌డం విశేషం. వరుసగా 20 సీజన్ల పాటు ఏసీ మిలాన్ క్లబ్​కే తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో ఆరు సెరీ ఏ (స్కూడెట్టోలు), మూడు యూరోపియన్ కప్‌లు, రెండు ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లు, రెండు యూఈఎఫ్ఏ సూపర్ కప్‌లు, నాలుగు ఇటాలియన్ సూపర్ కప్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 

1997లో ఆయన కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన గౌరవార్థం ఏసీ మిలాన్ ఆయన ప్రసిద్ధ నంబర్ 6 జెర్సీని శాశ్వతంగా రిటైర్ చేసింది. ఆయన 2020 నుంచి క్లబ్ ఉపాధ్యక్షుడిగా కొన‌సాగుతూ వ‌స్తున్నారు. తాజాగా ఫ్రాంకో మ‌ర‌ణ‌వార్త ఫుట్‌బాల్ అభిమానులను విషాదంలోకి నెట్టివేసింది. ఇక గతంలో నాలుగుసార్లు ఫిఫా చాంపియన్‌గా నిలిచిన ఇటలీ 2026 ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇటలీ గతంలో 4 సార్లు (1934, 1938, 1982, 2006) ఫిఫా ప్రపంచకప్‌ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది.

 

Read: శ‌త‌క్కొట్టిన లంక బ్యాట‌ర్‌.. చిత్తుగా ఓడిన‌ పాకిస్తాన్

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)